Reading Time: 2 minutes
ఈ బౌలింగ్‌తో WTC ఫైనల్ చేరినట్టే.. కనీసం లంకపైనైనా గెలవండ్రా బాబు..!

Virender Sehwag comments on Indian Bowlers: శ్రీలంక ఎలెవెన్‌తో జరిగిన తొలి రోజు ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత బౌలర్లు దారుణంగా నిరాశపరిచారు. ప్రత్యర్థి ఏకంగా 363 పరుగులు సాధించడంతో మన బౌలింగ్ ప్రదర్శనపై దిగ్గజ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ టీమిండియాను హెచ్చరించారు.

కొలంబో వేదికగా ఆతిథ్య శ్రీలంక ఎలెవెన్‌తో ప్రారంభమైన మూడు రోజుల ప్రాక్టీస్ పోరులో భారత జట్టుకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పిచ్ బౌలర్లకు ఏమాత్రం సహకరించకపోవడం, లంక బ్యాటర్లు సమిష్టిగా చెలరేగడంతో తొలి రోజు భారత బౌలింగ్ విభాగానికి తీవ్ర కష్టాలు ఎదురయ్యాయి. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక ఎలెవెన్ 8 వికెట్ల నష్టానికి ఏకంగా 363 పరుగుల భారీ స్కోరు సాధించింది. వికెట్ పడగొట్టడానికి మన బౌలర్లు మైదానంలో తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.

ఎక్కువమంది చదివినది: వరల్డ్ కప్ 2027 రేసు నుంచి ఆ 2 దిగ్గజ టీంలు ఔట్.. టీమిండియా పరిస్థితి ఏంటంటే?

తేలిపోయిన ప్రధాన పేసర్లు.. కాపాడిన స్పిన్ త్రయం..

ఈ మ్యాచ్‌లో భారత ప్రధాన పేస్ బౌలర్లు తీవ్రంగా విఫలమయ్యారు. ప్రసిద్ధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్ కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేక పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. స్పిన్నర్లు రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మానవ్ సుతార్ తలా రెండేసి వికెట్లు తీసి కాస్తో కూస్తో పర్వాలేదనిపించారు. అయితే, ఆతిథ్య జట్టు దిగువ వరుస బ్యాటర్లు కూడా స్వేచ్ఛగా పరుగులు సాధించడం భారత క్యాంప్‌లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.

సెహ్వాగ్ ఘాటు వ్యాఖ్యలు.. మారకపోతే సిరీస్ గెలవడం కష్టమే..

భారత బౌలర్ల పేలవ ప్రదర్శనపై డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఘాటుగా స్పందించారు. ఈ తరహా బౌలింగ్ ధోరణి కొనసాగితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సంగతి దేవుడెరుగు, శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ గెలవడం కూడా పెద్ద సవాలుగా మారుతుందని హెచ్చరించారు. గతంలో శ్రీలంక పర్యటనకు వెళ్లిన వేళ వన్డే సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కోల్పోయిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు.

ఎక్కువమంది చదివినది: ఇది ఇండియన్ టీమా లేక హాస్పిటల్ వార్డా..? ఆ దెబ్బకు రంగంలోకి బిగ్ బాస్..!

స్పిన్ ముప్పు, గిల్ గాయంపై గుబులు..

మరోవైపు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వేలి గాయం వల్ల తొలి టెస్ట్‌కు అందుబాటులో ఉంటాడా లేదా అనే సందిగ్ధం అభిమానుల్లో నెలకొంది. దీనికి తోడు గత మూడేళ్లుగా భారత బ్యాటర్లు స్పిన్ బౌలింగ్‌ను ఎదుర్కోవడంలో తీవ్రంగా తడబడుతున్నారు. శ్రీలంక స్పిన్ వికెట్లపై మన బ్యాటింగ్ విభాగానికి కఠిన పరీక్ష ఎదురుకానుంది. ఫాస్ట్ బౌలింగ్ విభాగం పుంజుకోవడంతో పాటు, లంక స్పిన్నర్లను తట్టుకునేలా బ్యాటర్లు సిద్ధం కాకపోతే లంక గడ్డపై భారత్‌కు చేదు అనుభవాలు తప్పవని సెహ్వాగ్ స్పష్టం చేశారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..