Reading Time: < 1 minute
Buchi Babu Sana Next Movie Director Begins Script Work After Peddi

దర్శకుడు బుచ్చిబాబు సాన మొదటి సినిమా ఉప్పెనతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఇక రెండవ సినిమాగా ఏకంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా పెద్ది సినిమాను డైరెక్ట్ చేసి టాక్ ఆఫ్ టౌన్ గా మారాడు. అయితే ఆశించినంత హిట్ కాకపోవడంతో బుచ్చిపై కాస్త నెగిటివిటి వచ్చింది. అయితే ఇప్పుడు బుచ్చి నెక్ట్స్ ఛాన్స్ ఇచ్చే స్టార్ హీరో ఎవరు.. తదుపరి ప్రాజెక్ట్ ఏంటి.. మళ్లీ స్టార్ హీరోతోనే సినిమా ఉంటుందా అనే విషయాలపై ఫిలిం నగర్ వర్గాల్లో తీవ్రంగా చర్చ సాగుతోంది.

‘ఉప్పెన’ వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత తన రెండో సినిమా కోసం దాదాపు నాలుగైదేళ్ల సమయం తీసుకున్న బుచ్చిబాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో భారీ పాన్-ఇండియా చిత్రం ‘పెద్ది’ తర్వాత గ్యాప్ రాకుండా చూడాలని ప్రయత్నిస్తున్నాడు. తాజాగా ఆయన తన మూడో ప్రాజెక్ట్‌పై దృష్టి సారించినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. భారీ చిత్రం తర్వాత రాబోతున్న సినిమా కావడంతో కథ వైవిధ్యంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే, ఈ ఏడాదిలోనే తన కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అయితే ఈసారి బుచ్చిబాబు ఏ హీరోతో జతకట్టబోతున్నారు, ఎలాంటి కథతో రాబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల ఓ బడా నిర్మాణ సంస్థ బుచ్చికి రెండు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చింది. మరి మూడవ సినిమా అదే బ్యానర్ లో చేస్తాడా లేదా అనేది చూడాలి.