Reading Time: < 1 minute

ప్రైవేట్ లేబుల్ వ్యాపారంలోకి ఫ్లిప్కార్ట్.. పిక్డ్ లేబుల్ పేరుతో సొంత ఉత్పత్తులు

Caption of Image.
  • పేరుతో సొంత ఉత్పత్తుల అమ్మకం

న్యూఢిల్లీ:ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ తన క్విక్ కామర్స్ విభాగమైన మినిట్స్​ ద్వారా పిక్డ్ పేరుతో కొత్త ప్రైవేట్ లేబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసింది. థర్డ్​ పార్టీ బ్రాండ్లపై పూర్తిగా ఆధారపడకుండా సొంత ఉత్పత్తులను అందించాలని నిర్ణయించుకుంది. పట్టణ ప్రాంతాలలో ప్రీమియం వస్తువులకు పెరుగుతున్న డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో పోటీ మరింత తీవ్రతరం కానుంది. బ్లింకిట్ ఇప్పటికే గార్మెట్ పేరుతో సేవలను ప్రారంభించింది. 

జెప్టో కూడా సెలెక్ట్ పేరుతో ప్రీమియం కిరాణా సేవలను తీసుకువచ్చింది. ఈ విభాగంలో ఇతర కంపెనీలకు దీటుగా నిలవడానికి ఫ్లిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కార్ట్ తన సొంత బ్రాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను   ప్రవేశపెట్టింది. వినియోగదారులకు వేగంగా నాణ్యమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ సంస్థలు ముందుకు సాగుతున్నాయి. ఫ్లిప్​కార్ట్​ గార్మెట్ కిరాణా మార్కెట్లోకి కూడా అడుగుపెట్టింది.  ప్రీమియం, ప్రత్యేక ఆహార ఉత్పత్తులను అమ్మనుంది.  

©️ VIL Media Pvt Ltd.