
Hyundai Exter Facelift Launched: హ్యుందాయ్ (Hyundai) కంపెనీ భారత మార్కెట్లో ఎక్స్టర్ ఫేస్‌లిఫ్ట్ (Exter Facelift) మోడల్‌ను విడుదల చేసింది. ఈ కొత్త కారు వేరియంట్స్ HX2, HX4, HX6, HX8, HX10గా ఉన్నాయి. బయటకు చిన్న మార్పులా కనిపించినా, లోపల మాత్రం భారీ అప్‌డేట్స్ ఉన్నాయి. ఈ కారు డిజైన్‌లో పెద్ద మార్పులు లేకపోయినా.. కారు ముందుభాగం మరింత వెడల్పుగా కనిపించేలా కొత్త బ్లాక్ గ్రిల్, అప్డేటెడ్ బంపర్లను అందించారు. ఇంకా కొత్త 15 అంగుళాల డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వాహనానికి కొత్త స్టాన్స్‌ను అందిస్తున్నాయి. అలాగే వెనుక భాగంలో వింగ్ టైప్ స్పాయిలర్, కొత్త C-పిల్లర్ డిజైన్ ను అందించారు. ఈ కారుకు కొత్తగా గోల్డెన్ బ్రాంజ్, టైటానియం బ్లాక్ మ్యాట్ అనే రెండు కలర్స్ ను తీసుక వచ్చింది కంపెనీ.
New Rules for Coaching Centers: ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు.. ఉల్లంఘిస్తే అంతే..!
ఇక ఇంటీరియర్లో మాత్రం చాలా మార్పులని అందుకుంది. క్యాబిన్ లో నేవీ-గ్రే డ్యూయల్ టోన్ థీమ్, 3D కార్బన్ ప్యాటర్న్ డాష్‌బోర్డ్ ఫినిష్ ప్రధాన ఆకర్షణ. ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, మెటల్ పెడల్స్ వంటివి అందించారు. డ్రైవర్ సీట్ హైట్ అడ్జస్ట్ ఫీచర్, వెనుక హెడ్‌రెస్ట్ లను స్టాండర్డ్ గా పొందుపరిచారు. అలాగే బిల్ట్-ఇన్ డ్యాష్‌క్యామ్, రియర్ టైప్-C ఛార్జింగ్ పోర్ట్ వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ కూడా చేస్తుంది.
బ్లూలింక్ ద్వారా 60కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఎలక్ట్రిక్ సన్ రూఫ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇంటర్నెట్ లేకుండా పనిచేసే 300కి పైగా వాయిస్ కమాండ్స్ కూడా ఉన్నాయి. మ్యాప్స్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ను ‘ఓవర్ ది ఎయిర్’ ద్వారా అప్డేట్ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అయితే ఇంజిన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ 82 bhp పవర్, 114 nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్ తో వస్తుంది. ఇక ఈ కొత్త మోడల్ CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. ఇది 68 bhp పవర్, 95.2 nm టార్క్‌తో మాన్యువల్ గేర్ బాక్స్ లో లభిస్తుంది.
MS Dhoni Ruled Out IPL: బ్యాడ్ న్యూస్.. ఐపీఎల్ 2026 మ్యాచ్ లకు మిస్టర్ కూల్ ‘ధోని’ దూరం..!
CNG వేరియంట్‌లో స్పేర్ వీల్‌ను కింద భాగంలో అమర్చడం వల్ల బూట్ స్పేస్ 225 లీటర్లకు పెరిగింది. పెట్రోల్ వేరియంట్లలో మాత్రం 391 లీటర్ల బూట్ స్పేస్ యథాతథంగా ఉంది. ఈ కొత్త మోడల్ ప్రారంభ ధర రూ. 5.80 లక్షలు (ఎక్స్‌షోరూమ్)గా నిర్ణయించారు. ఇది పూర్తిగా కొత్త మోడల్ కాకపోయినా.. డిజైన్, ఫీచర్లు, భద్రత పరంగా 25కి పైగా అప్‌డేట్స్‌తో తీసుకొచ్చింది. ఈ కారుకు బుకింగ్స్ రూ. 11,000తో ఆన్‌లైన్, డీలర్ షిప్ లలో ప్రారంభమయ్యాయి.