Reading Time: 2 minutes
Peddi Glimpse Review Ram Charans Stunning Transformation And Kusti Scenes Go Viral

Ram Charan’s Peddi Pehelwan Glimpse Review: ‘గ్లోబల్ స్టార్’ రామ్‌ చరణ్‌ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘పెద్ది’. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉంది. ఉత్తరాంధ్ర నేపథ్యంతో స్పోర్ట్స్‌ అండ్ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఏప్రిల్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు రామ్‌ చరణ్‌ పుట్టినరోజు సందర్భంగా పెద్ది నుంచి గ్లింప్స్‌ను విడుదల చేశారు. ‘పెద్ది పహిల్వాన్’ పేరుతో ఈ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది.

గ్లింప్స్ చూసిన అభిమానులు ‘ఇంత రేంజ్‌లో ఉంటుందని అస్సలు ఊహించలేదు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్, స్క్రీన్ ప్రెజెన్స్ పీక్స్‌లో ఉన్నాయని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘ఆ బాడీ ఏంట్రా బాబు’, ‘చరణ్ అన్న.. చించేశావ్’, ‘ఇది అసలైన బర్త్‌డే ట్రీట్’ అంటూ ఫాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దర్శకుడు బుచ్చిబాబు ఈ చిత్రంలో చరణ్‌ను పూర్తిగా కొత్త కోణంలో ప్రెజెంట్ చేస్తున్నట్లు గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. ఇప్పటి వరకు చూడని లుక్‌లో, మాస్ అండ్ రస్టిక్ టచ్‌తో చరణ్ కనిపించడం అభిమానుల్లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ముఖ్యంగా కుస్తీ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతున్న ఈ కథలో చెర్రీ చేసే విన్యాసాలు గూస్‌బంప్స్ తెప్పిస్తున్నాయి.

Also Read: Anil Ravipudi Movie: అక్కడ సినిమా తీస్తుంది అనిల్.. ఆ ఇద్దరు ప్లాప్ భామలు సక్సెస్ కొట్టినట్టేనా?

పెద్ది గ్లింప్స్‌లో కుస్తీకి ప్రాధాన్యం ఇచ్చిన తీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘పెద్ది అంటే బంతితో బ్యాటుకు ఎదురెళ్లే ఆట కాదురా.. పాణంతో సావుకు ఎదురెళ్లే ఆట’, ‘చూడమ్మే.. ఆటే నా పొగరు’ అనే డైలాగ్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా మల్లయోధుడిగా రామ్ చరణ్ అదరగొట్టారు. ఆయన లుక్, బాడీ లాంగ్వేజ్, పోరాట సన్నివేశాలు.. అన్ని కలిపి సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ గ్లింప్స్ చూసిన తర్వాత వెండి తెరపై ‘పెద్ది’ విన్యాసాలు ఎప్పుడు చూస్తామా అనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. మొత్తానికి పెద్ది గ్లింప్స్‌ అసలైన బర్త్‌డే ట్రీట్ అనే చెప్పాలి. పాటల మాదిరి.. గ్లింప్స్‌ కూడా రికార్డులు కొల్లగొట్టడం ఖాయం.