Reading Time: < 1 minute
What Is %d8%a7%d9%84%d8%b1%d9%8a%d8%a7%d8%b6_%d8%a7%d9%84%d8%a7%d9%86 Arabic Hashtag Trending Amid Iran Israel War Explained

US-Israel-Iran War: మధ్యప్రాచ్యంలో ఇరాన్–ఇజ్రాయెల్ యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ, సోషల్ మీడియాలో ఒక అరబిక్ హ్యాష్‌ట్యాగ్ వేగంగా ట్రెండ్ అవుతోంది.. అదే — #الرياض_الان… అయితే, ఈ పదానికి అర్థం ఏంటి? ఇప్పుడు ఎందుకు ట్రెండింగ్‌గా మారిపోయింది అనే చర్చ కూడా మరోవైపు సాగుతోంది.. అయితే #الرياض_الان.కు “రియాద్ ఇప్పుడు” (Riyadh Now). అంటే సౌదీ అరేబియా రాజధాని Riyadhలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రత్యక్ష నవీకరణలు అనే భావం.

* ట్రెండింగ్‌కు ప్రధాన కారణాలు
1. రియాద్‌లో భారీ వర్షాలు: ఇటీవల రియాద్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. స్థానికులు దీనిని శుభ సూచకంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నారు. ప్రజలు వర్షపు వీడియోలు, మేఘాల దృశ్యాలు, రోడ్లపై నీరు నిలిచిన చిత్రాలు షేర్ చేస్తున్నారు. వాతావరణ పరిస్థితులపై రియల్ టైమ్ అప్‌డేట్స్ ఈ హ్యాష్‌ట్యాగ్‌తో పంచుకుంటున్నారు.

2. ప్రాంతీయ ఉద్రిక్తతలు, దాడుల ప్రభావం: ఇక, ఇరాన్–ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సౌదీ అరేబియాలో భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ చమురు సంస్థ Saudi Aramcoకు చెందిన రాస్ తనూరా శుద్ధి కర్మాగారంపై దాడి జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి.

రాస్ తనూరా ప్రాంతంలో జరిగిన పేలుళ్లు, అగ్ని ప్రమాదాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రజలు భద్రత కోసం ప్రార్థనలు చేస్తూ, తాజా పరిస్థితులపై సమాచారం పంచుకుంటున్నారు. కొన్ని పోస్టుల్లో #TelAvivBlast, #IranWar వంటి ట్యాగ్‌లు కనిపిస్తున్నప్పటికీ, ప్రధాన దృష్టి రియాద్ పరిస్థితులపైనే ఉంది. అయితే, #الرياض_الان ప్రస్తుతం రియాద్ నగరంలో జరుగుతున్న ప్రతీ విషయానికి ఒక ప్రత్యక్ష సమాచార వేదికగా మారింది. అది వాతావరణం కావచ్చు, ట్రాఫిక్ పరిస్థితులు కావచ్చు, భద్రతా హెచ్చరికలు కావచ్చు.. అన్నింటినీ ఈ ట్యాగ్ ద్వారా పంచుకుంటున్నారు. యుద్ధ ఉద్రిక్తతలు మరియు భారీ వర్షాలు ఒకేసారి చోటుచేసుకోవడంతో, ఈ హ్యాష్‌ట్యాగ్ అత్యంత చురుకైన స్థానిక ట్రెండ్‌గా మారింది.