
ఇప్పటినుంచి ఏపీ ప్రజలు ఎఫ్ఐఆర్ స్టేటస్ , ట్రాఫిక్ చలాన్లు వివరాలు, మరికొన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని వాట్సప్ ద్వారా పొందవచ్చు. ఇక చలాన్లను ఆన్లైన్ ద్వారా చెల్లించే సదుపాయం కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో పోలీస్ చలాన్లతో పాటు రవాణా శాఖ చలాన్లను కూడా ఉంటాయి. ఈ సేవలను ప్రజలు సులభంగా ఉపయోగించుకోవచ్చని తెలిపారు.ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు సేవల వినియోగంపైన అధికారులు సూచనలు చేస్తున్నారు. ప్రభుత్వ సర్టిఫికెట్లతో పాటు ఆర్టీసీ , దేవాలయ దర్శన్ టికెట్లు కూడా వాట్సప్ గవర్నమెంట్ ద్వారా అందిస్తోంది. తాజాగా ఈ సేవలను విస్తరిస్తూ మరిన్ని కొత్త సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ సేవల వినియోగంపై అధికారులు ప్రభుత్వం నిర్దేశించిన 95523 00009 నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందుకోసం నెంబర్‌ను ఫోన్లో సేవ్ చేసుకొని.. మనమిత్ర , వాట్సాప్ గవర్నెన్స్ అనే ఆప్షన్లు ఎంచుకోవాలి. అక్కడ పోలీస్ శాఖ సేవలను కూడా సెలెక్ట్ చేసి కావాల్సిన సేవలను పొందవచ్చు.. చలాన్లను చెల్లించడానికి , వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసి , బ్యాంకు ద్వారా చెల్లించి రసీదును పొందవచ్చు.
మరిన్ని వీడియోల కోసం :
స్టార్ హీరోలు కూడా భయపడుతుంటే.. కాజల్ ఒక్కతే ధైర్యంగా కామెంట్ చేసింది వీడియో