Reading Time: < 1 minute

మహారాష్ట్రలోని ఈ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన RBI: డిపాజిటర్ల డబ్బు ఏమవుతుందంటే ?

Caption of Image.

మహారాష్ట్రకు చెందిన షిర్‌పూర్ మర్చంట్స్ కో-ఆపరేటివ్ బ్యాంక్ పై భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) కఠిన చర్యలు తీసుకుంది. ఈ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేకపోవడంతో  లైసెన్స్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే బ్యాంకు దగ్గర తగినంత డబ్బు లేదని, భవిష్యత్తులో లాభాలు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదని RBI స్పష్టం చేసింది. అందుకే ఏప్రిల్ 6, 2026 నుంచి ఈ బ్యాంక్  కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని ఆదేశించింది. అంతేకాదు, బ్యాంకును పూర్తిగా మూసివేసేందుకు ఒక అధికారిని నియమించాలని మహారాష్ట్ర సహకార శాఖను కోరింది.

కస్టమర్ల పరిస్థితి ఏంటి
బ్యాంకులో డబ్బులు దాచుకున్న వారు కంగారు పడాల్సిన అవసరం లేదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ (DICGC) పథకం కింద ప్రతి డిపాజిటర్‌కు రూ. 5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది. ఈ బ్యాంక్ కస్టమర్లలో దాదాపు అందరికీ 99.7% మందికి వారి పూర్తి డబ్బులు వెనక్కి వస్తాయని RBI తెలిపింది.  2026 జనవరి 31 నాటికే సుమారు రూ. 48.95 కోట్లను బీమా రూపంలో డిపాజిటర్లకు అందజేశారు.

బ్యాంక్ ఎందుకు మూసివేశారు
నిధుల కొరత వల్ల కస్టమర్లకు తిరిగి చెల్లించడానికి బ్యాంకు దగ్గర సరిపడ నిధులు లేవు. అలాగే బ్యాంకు నడుస్తున్న తీరు వల్ల కస్టమర్లకే నష్టం జరుగుతుందని RBI భావించింది. లైసెన్స్ రద్దు కావడంతో, ఇకపై ఈ బ్యాంక్ ప్రజల నుంచి డిపాజిట్లు తీసుకోవడం గానీ, పాత బాకీలు కట్టడం గానీ చేయకూడదు.

మీ డిపాజిట్ రూ. 5 లక్షల లోపు ఉంటే, బీమా సంస్థ ద్వారా మీ డబ్బు మీకు సురక్షితంగా అందుతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నవారికి బ్యాంక్ ఆస్తుల అమ్మకం తర్వాత వచ్చే నిధుల ఆధారంగా చెల్లింపులు జరుగుతాయి.

 

©️ VIL Media Pvt Ltd.