Reading Time: 2 minutes

జిమ్‌కు వెళ్లే టైం లేదా ? ఇంట్లోనే కేవలం 7 నిమిషాలు కేటాయిస్తే చాలు.. ఈజీగా బరువు తగ్గొచ్చు!

Caption of Image.

బరువు తగ్గేందుకు, ఫిట్ నెస్  కోసం జిమ్, ఫిట్ నెస్  సెంటర్లకు వెళ్తుంటారు. కొందరికేమో అంతటైం ఉండదు. అలాంటప్పుడు మన బిజీ షెడ్యూల్లో ఏడూ అంటే  ఏడు నిమిషాలు కేటాయిస్తే ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నాడు యుఎస్ కి చెందిన ఫిట్ నెస్  ట్రైనర్ క్రిష్ జోర్డాన్, ఒక్కో ఎక్సర్ సైజ్ ను 30 సెకన్లపాటు హై ఇంటెన్స్ తో చేస్తే ఫిట్ గా ఉంటామని చెబుతున్నాడు. ఈ ఏడు నిమిషాల్లోనే కార్డియో, అప్పర్ బాడీ, లోయర్ బాడీ, కోర్ మజిల్ ఎక్సర్ సైజ్లు ఉన్నాయి.

* మనం నిల్చున్న ప్లేస్ లోనే కాళ్లు పైకి లేపుతూ జాగింగ్ చేయడం. దాన్నే ‘మార్చ్’ ఇన్ ప్లేస్  అంటారు.

*చైర్ ముందు నిలబడి కాళ్లు రెండు వెడల్పుగా పెట్టి వెనక్కు తిరగాలి. రెండు చేతులు చాచి చైర్లో కూర్చున్నట్లుగా కిందకు వంగి, మళ్లీ పైకి లేవాలి. పూర్తిగా కూర్చోకూడదు. ఈ ఎక్సర్సైజ్ ను చైర్ అసిస్ట్ వర్కవుట్ అంటారు.

*కాళ్లు రెండు వెడల్పుగా పెట్టి రెండు చేతులను తల వెనుక పెట్టాలి. కుడికాలు పైకి లేపి ఎడమ చేయి మోచేతికి తగిలేలా ట్విస్ట్ చేయాలి. అలానే ఎడమ కాలిని కుడి చేయి మోచేతికి తగిలేలా ట్విస్ట్ చేయాలి. దీన్ని స్టాండింగ్ బైసైకిల్ క్రంచ్ అంటారు.

*కుర్చీ పక్కన ఒక కాలు ముందుకు పెట్టి, రెండో కాలు వెనక్కి పెట్టాలి. ముందు ఉంచిన కాలిపాదం నేలకు తాకేలా, వెనక్కి ఉన్న కాలి మోకాలు నేలకు తగలకుండా చూసుకోవాలి. బ్యాలెన్స్ ఆగకపోతే చేతిని కుర్చీ మీద పెట్టుకోవచ్చు. అలా ఒక్కో కాలు మీద 15 సెకన్లు బ్యాలెన్స్ చేయాలి. ఇదే చైర్ అసిస్ట్ స్ప్లిట్ స్క్వాట్.

*కుర్చీ మీద చేతులు ఉంచి కొంచెం వెనక్కు నడవాలి. బాడీని 45 డిగ్రీల యాంగిల్లో లో ఉంచాలి. ఇప్పుడు చేతులు వంచుతూ పుషప్స్ తీయాలి. దీన్నే చైర్ అసిస్ట్ పుషప్ అంటారు.

*పిడికిలి బిగించి మోచేతులను గోడకు ఆనించాలి. రెండు అడుగులు వెనక్కి జరిగి కంఫర్టబుల్ పొజిషన్ లో నిలబడితే పొట్ట కండరాలపై ప్రెజర్ పడుతుంది.

*గోడకు ఆనుకుని కుర్చీలో కూర్చున్నట్టుగా కిందకు జరగాలి. రెండు చేతులు మడిచి పెట్టాలి. ఇలా చేస్తే కాళ్లమీద ప్రెజర్ పడుతుంది. ఇలా 30 సెకన్లు బ్యాలెన్స్ చేయాలి. దీన్నే వాల్ సిట్ అంటారు.

*గోడ లేదా చైర్ సాయంతో పుషప్స్ చేయాలి. భుజాలు, ఛాతి భాగంలో ప్రెజర్ ఫీలయ్యేలా పుషప్స్ చేయాలి. దాన్నే వాల్ పుషప్ అంటారు.

*చేతులు తలవెనుక పెట్టి కుడివైపుకు వంగి కుడి మోకాలు కుడి మోచేతికి తగిలేలా పైకి లేపాలి.. ఇప్పుడు ఎడమవైపు కూడా ఇలానే చేయాలి. ఇలా చేస్తే పొట్ట పక్కభాగంలో ప్రెజర్ తెలుస్తుంది. ఈ ఎక్సర్ సైజ్ ని స్టాండింగ్ సైడ్ క్రంచ్ అంటారు.

©️ VIL Media Pvt Ltd.