Reading Time: < 1 minute

సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు శ్రీనివాసన్(69) శనివారం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మరణించారు. నాలుగు దశాబ్ధాలుగా ఆయన చిత్ర పరిశ్రమకి సేవలు అందించారు. 1956లో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆయన దాదాపు 225 చిత్రాల్లో నటించారు. ఈ సుదీర్ఘ నట ప్రస్థానంలో ఆయన ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. 1989లో ఆయన స్వీయ దర్శకత్వంలో ‘వడక్కునొక్కియంత్రం’ అనే మలయాళ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిసినిమాకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ చిత్రం అవార్డును ఇచ్చింది. శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.