
మెక్‌కే: బంగ్లాదేశ్‌తో రెండు రోజుల్లోనే ముగిసిన రెండో టెస్ట్‌లో ఆస్ట్రేలియా భారీ విజయాన్ని సాధించింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ (4/39) మ్యాచ్ మొత్తంలో పది వికెట్లు తీయడంతో.. ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్‌లో ఆసీస్ ఇన్నింగ్స్ 51 రన్స్ తేడాతో బంగ్లాను చిత్తు చేసింది. ఫలితంగా రెండు మ్యాచ్‌ల సిరీస్ 1–1తో డ్రా అయ్యింది.
165/8 ఓవర్‌నైట్ స్కోరుతో ఆదివారం రెండో రోజు ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 52.3 ఓవర్లలో 210 రన్స్‌కు ఆలౌటైంది. కామెరూన్ గ్రీన్ (67), నాథన్ లైయన్ (32 నాటౌట్) మెరుగ్గా ఆడారు. షోరిఫుల్ ఇస్లామ్ 7 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్‌లో 38.3 ఓవర్లలో 95 రన్స్‌కే ఆలౌటైంది. కెప్టెన్ నజ్ముల్ హుస్సేన్ షాంటో (31), ముష్ఫికర్ రహీమ్ (29) మినహా మిగతా వారు విఫలమయ్యారు.
స్టార్క్‌తో పాటు కమిన్స్ (3/10), నాథన్ లైయన్ (3/25) చెలరేగడంతో బంగ్లా ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. తొమ్మిది మంది సింగిల్ డిజిట్‌కే పరిమితం కావడంతో బంగ్లాకు భారీ ఓటమి తప్పలేదు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘సిరీస్’ అవార్డులను సొంతం చేసుకున్న స్టార్క్.. టెస్ట్‌ల్లో 445 వికెట్లతో ఆల్‌టైమ్ జాబితాలో పదో స్థానంలో నిలిచాడు. టెస్ట్‌ల్లో పది వికెట్లు తీయడం స్టార్క్‌కు ఇది నాలుగోసారి కావడం విశేషం.