Reading Time: 2 minutes
Bullet Train: దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్.. ఈ వీడియో చూస్తే అబ్బురపోవాల్సిందే.. ఆహా ఎలా ఉందంటే..?

భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్‌పై కీలక అప్డేట్ వచ్చింది. దేశంలోనే తొలి బుల్లెట్ రైలును ముంబై-అమ్మదాబాద్ హైస్పీడ్ రైలు కారిడార్‌లో ప్రవేశపెట్టనున్నారు. 508 కిలోమీటర్ల మేర ఈ కారిడార్ ఉండనుండగా.. పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే 453 కిలోమీటర్ల మేర పిల్లర్ల నిర్మాణం పూర్తవ్వగా.. 359 కిలోమీటర్ల మేర వయాడక్ట్‌లు పూర్తయ్యాయి. నేషనల్ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెట్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతున్నాయి. దృఢమైన స్తంభాలతో పిల్లర్ల నిర్మాణం జరుగుతుండగా.. వాటి ఆధారంగా వయాడక్ట్, రైల్వే ట్రాక్ నిర్మాణం జరుగుతోంది. చాలా ప్రాంతాల్లో పిల్లర్ల దశను దాటి ట్రాక్ పనుల వరకు చేరుకుంది. దీనికి సంబంధించిన ఒక వీడియో బయటకొచ్చింది.

పూర్తవుతున్న నిర్మాణాలు

215 కిలోమీటర్ల ఆర్‌సీ ట్రాక్ బెడ్ నిర్మాణం కూడా పూర్తయింది. ఇక 91 కిలోమీటర్ల మేర ట్రాక్ స్లాబ్‌లను కూడా వేశారు. ఇక సిమెంట్ ఆస్పాల్ట్ మోర్టార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఇక విద్యుత్ వ్యవస్థ పనులు కూడా ట్రాక్ వెండి సమాంతరంగా జరుగుతుండగా.. 200 కిలోమీటర్ల మేర 9 వేలకుపైగా ఓవర్ హెడ్ పరికరాల స్తంభాలను ఏర్పాటు చేశారు. ఇవి బుల్లెట్ రైళ్లకు విద్యుత్‌ను సరఫరా చేస్తాయి. దారి పొడవునా ఇవి విద్యుత్‌ను సరఫరా చేయడంలో సహాయపడతాయి. బుల్లెట్ రైళ్లు అత్యంత వేగంగా ప్రయాణం చేస్తాయి. వీటి వల్ల వచ్చే భారీ శబ్దాన్ని తగ్గించేందుకు దారి పొడవునా శబ్ద నిరోధకాలను కూడా ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటివరకు 297 కిలోమీటర్ల మేర నిరోధకాలను ఏర్పాటు చేశారు.

2027 ఆగస్ట్‌లో తొలి బుల్లెట్ ట్రైన్

ఇక నదులు, పెద్ద కట్టడాల పైన నుంచి వెళ్లేందుకు వంతెనల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇప్పటివరకు 17 నదీ వంతెనలు, 15 ఉక్కు వంతెనలు పూర్తయ్యాయి. ఇక ఈ ప్రాజెక్టులో భాగంగా నాలుగు పర్వత సొరంగాల తవ్వకం పూర్తవ్వగా.. అదనంగా న్యూ ఆస్ట్రియన్ టన్నెలింగ్ మెథడ్ (NATM)ను ఉపయోగించి 5 కిలోమీటర్ల సొరంగ తవ్వారు. బుల్లెట్ రైళ్లు దాదాపు గంటకు 302 కిలోమీటర్ల వేగంగా ప్రయాణం చేస్తాయి. దీని వల్ల ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. రెండు గంటల్లోనే ఒక నగర నుంచి మరో నగరానికి చేరుకోవచ్చు. ఈ ప్రాజెక్టులో భాగంగా తొలుత సూరత్-వాపి మధ్య బుల్లెట్ రైలు ప్రవేశపెడతారు. ఈ మార్గం 100 కిలోమీటర్లు ఉంటుంది. దశలవారీగా ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేస్తారు. ఆగస్ట్ 2027 నాటికి ఈ మార్గంలో తొలి బుల్లెట్ రైలు ప్రవేశపెట్టనుండగా.. 2029 నాటికి ప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్ 15న తొలి బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.