
జ్యోతిష్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం 2026 లో ఏర్పడే రెండో సూర్యగ్రహణ ప్రభావం ఎక్కువుగా ఉంటుందని చెబుతున్నారు. భారతదేశంలో కనపడకపోయినా జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం మీ రాశిని బట్టి కొన్ని వస్తువులను దానం చేయాలని పండితులు చెబుతున్నారు.. ఇప్పుడు ఏ రాశి వారు ఎలాంటి వస్తువులు దానం చేయాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. .
ఖగోళ శాస్త్రవేత్తలు. . జ్యోతిష్య పండితులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది రెండో సూర్య గ్రహణం ఆగస్టు 12 రాత్రి 9:04 గంటలకు గ్రహణం ప్రారంభమై… ఆగస్టు 13 ఉదయం 4:25 గంటలకు ముగుస్తుంది. అయితే ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం వర్తించదు. గ్రహణం కనిపించకపోయినా 12 రాశుల వారిపై ప్రభావం పడుతుంది.
సూర్యగ్రహణంతో జాతకంలో వచ్చే చెడు ప్రభావాల నుంచి ఉపశమనం పొందడానికి రాశుల వారీగా కొన్ని వస్తువులను దానం చేయాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దీనివలన జాతకంలోని అశుభ ప్రభావాలను తగ్గించి శుభ ఫలితాలను ఇస్తాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఈ చర్యలను పాటించడం కచ్చితంగా ద్వాదశ రాశుల వారికి మేలు చేస్తుందని పండితులు చెబుతున్నారు.
మేషరాశి: ఈ రాశి వారు సూర్యగ్రహణం తరువాత హనుమాన్ చాలీసా చదువుకుంటే మంచిది. పేదలకు అన్నదానం, వస్త్రదానం చేయాలి. దేవాలయంలో బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. ఇలా చేయడం వలన జీవితంలో సానుకూల మార్పులు కలిగి కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కొత్త బాధ్యతలను చేపడతారు. ఎప్పటినుంచో పూర్తికాని సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
వృషభ రాశి: ఈ రాశి వారు గ్రహణం తరువాత ఆగస్టు 13 వ తేదీన ఉదయం శివుడికి తెలుగు రంగు పూలను సమర్పించి.. అభిషేకం చేయాలి. పాలు,పెరుగు దానం చేయాలి. దేవాలయంలో కర్పూరం ఇవ్వాలి. పేదలకు అన్నదానం చేయాలి. దక్షిణ తాంబూలం ఇవ్వాలి. ఇలా చేయడం వలన కొత్త అవకాశాలు కలిగి ఆర్థికంగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు.
మిథున రాశి: గ్రహణం తరువాత ఈ రాశి వారు కూరగాయలు దానం చేయాలి. గోమాతకు పచ్చిగడ్డి ఆహారంగా ఇవ్వాలి. చదువుకొనే పిల్లలకు బట్టలు, పుస్తకాలు ఇవ్వాలి. ఇలా చేయడం వలన కెరీర్ లో కొత్త అవకాశాలు వచ్చి ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి: గ్రహణం తరువాత ఈ రాశి వారు సూర్యభగవానుడికి నమస్కరించాలి. నీటిని సమర్సించాలి. పేదలకు తెల్లని వస్త్రాలు దానం చేయాలి. దేవాలయంలో బియ్యం, దక్షిణ ఇవ్వాలి, ఇలా చేయడం వలన పని ప్రదేశంలో పెరిగే ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి.
సింహ రాశి: ఈ రాశి వారు గ్రహణం తరువాత ఆవునెయ్యితో దీపారాధన చేయాలి. ఆ తరువాత సూర్యష్టకం చదవాలి. ఇలా చేయడం వలన గొడవలు.. సమస్యలు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు. గోధుమలు, బెల్లం దానం చేయడం వలన ఈ రాశి వారికి సకల దోషాలకు విముక్తి కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
కన్యారాశి: ఈ రాశి వారు గ్రహణం తరువాత విద్యార్థులకు ధన సహాయం చేయాలి. పేదలకు దుప్పట్లు పంచిపెట్టాలి. హనుమంతునికి వడమాల సమర్పించాలి.ఆవుకు పచ్చి మేత, పెసరపప్పు, ఉలవలు, పచ్చి కూరగాయలు ఆహారంగా ఇవ్వాలి. ఇలా చేయడం వలన జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలకు పరిష్కారం కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
తులా రాశి: ఈ రాశి వారు గ్రహణం తరువాత శివాలయంలో దీపారాధనకు నువ్వుల నూనె ఇవ్వాలి. ఆవు పాలతో అభిషేకం చేసి స్వామివారికి అలంకరణ సామాగ్రి ఇవ్వాలి. ఇలా చేయడం వలన మంచి అవకాశాలు రావడం.. పెండింగ్ పనులు పూర్తి కావడంతో నిరుద్యోగులకు మంచి జాబ్ లభించే అవకాశం ఉంది.
వృశ్చికరాశి: ఈ రాశి వారు శివుడికి తేనె సమర్పించాలి. పప్పు, శనగపిండి, బెల్లం, పసుపు, కుంకుమ మొదలైన వాటిని దానం చేయాలి. ఇలా చేయడం వలన కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులు లాభాల బాట పడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు గ్రహణం తరువాత పిల్లలకు, వృద్దులకు, అనాథలకు స్వీట్లు పంచి పెట్టాలి. పసుపు రంగు బట్టలు పంచి పెట్టాలి. గ్రహణం తరువాత తెల్లని వస్త్రాలు, పంచదార, బియ్యం, వెండి, పాలు లేదా పాలతో చేసిన స్వీట్లను దానం చేయాలి. ఇలా చేయడం వలన గ్రహణం వలన కలిగే చిన్న చిన్న ఇబ్బుందులు పరిష్కారమవుతాయి.
మకర రాశి: ఈ రాశి వారు గ్రహణం తరువాత ప్రశాంతంగా కూర్చొని ఇష్ట దైవాన్ని ధ్యానం చేయాలి. తరువాత గొడుగు, నల్ల రంగు దుస్తులు దానం చేయాలి. శివాలయంలో శని భగవానుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం వలన అన్ని రకాల సమస్యలు పరిష్కారమవుతాయని పండితులు చెబుతున్నారు.
కుంభరాశి: ఈ రాశి వారు పరమేశ్వరుడికి తేనె,పంచదార సమర్పించాలి. నీలం రంగు బట్టలు, ఆవాల నూనె, నల్ల నువ్వులు శని భగవానుడికి సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు కెరీర్ లో మంచి అవకాశాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.
మీనరాశి: ఈ రాశివారు ఎర్రని స్వీట్లను పంచి పెట్టాలి. పేదలకు బెల్లం, శనగపప్పు, పసుపు బట్టలు మొదలైన వాటిని తప్పనిసరిగా దానం చేయాలి. ఇలా చేయడం వలన ఆఫీసులో ఒత్తిడి తగ్గి.. సకల పనుల్లో విజయం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.