Reading Time: < 1 minute
Diy Turmeric Face Mask Summer Tan Removal Glowing Skin Tips

Turmeric Face Mask: వేసవి కాలం వచ్చింది.. ఎండలు ముదురుతున్నాయి.. తీవ్రమైన ఎండ, ధూళి, చెమట కారణంగా చర్మం ట్యాన్ అవ్వడం (నల్లబడటం), జిడ్డుగా మారడం వంటి సమస్యలు ఈ కాలంలో సాధారణంగా అందరినీ వేధిస్తుంటుంది. నిజానికి చాలా మంది ఈ సమస్యల నుంచి బయట పడటానికి మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీములు వాడుతుంటారు. అయితే మన వంటగదిలో ఉండే ‘పసుపు’తో ఇంట్లోనే అద్భుతమైన ఫేస్ మాస్క్ సిద్ధం చేసుకోవచ్చని తెలుసా. ఇది ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

READ ALSO: Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?

పసుపు ఫేస్ మాస్క్ ప్రత్యేకం ఎందుకంటే..
పసుపులో ఉండే ‘కర్కుమిన్’ అనే మూలకం చర్మానికి యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలను అందిస్తుంది. ఇది చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి, సహజమైన కాంతిని ఇస్తుంది. ఈ ఫేస్ మాస్క్‌కు పసుపును నేరుగా వాడటం కంటే, కాస్త వేయించి వాడటం వల్ల రిజల్ట్ మరింత మెరుగ్గా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

దీనికి కావలసిన పదార్థాలు
1. వేయించిన పసుపు (ఒక చెంచా)
2. తేనె (ఒక చెంచా)
3. పెరుగు లేదా పాలు (అవసరానికి తగినట్లు)
4. కొద్దిగా నిమ్మరసం (జిడ్డు చర్మం ఉన్నవారికి)

తయారీ విధానం
ముందుగా ఒక గిన్నెలో పసుపు, తేనె, పెరుగు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖం, మెడ భాగంలో అప్లై చేసి 15-20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లని నీటితో దీనిని కడిగేయాలి. అంతే సింపుల్.

ప్రయోజనాలు ఇవే..
ఈ పసుపు మాస్క్ ఎండ వల్ల నల్లబడిన చర్మాన్ని మళ్లీ కాంతివంతంగా మారుస్తుంది. పసుపులోని బ్యాక్టీరియా వ్యతిరేక గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. అలాగే ఇది చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించి, ముఖానికి ఇన్-స్టాంట్ గ్లోను ఇస్తుంది. వారానికి రెండు సార్లు ఈ పసుపు మాస్క్ వాడటం వల్ల వేసవిలో కూడా మీ చర్మం తాజాగా, ఆరోగ్యంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఖరీదైన ఫేషియల్స్ కంటే ఈ నాచురల్ పద్ధతి చర్మానికి ఎంతో మేలు చేస్తుందని చెబుతున్నారు.

READ ALSO: Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..