Reading Time: < 1 minute

ఎపిలోని రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఆరోపణలు గుప్పిస్తున్న బాధితురాలు హర్షవీణ మరో కొత్త వీడి యోను విడుదల చేశారు. తన సమస్యపై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించాలని, ఒకవేళ తనకు న్యాయం జరగకపోతే జనసేన పార్టీ కార్యా లయం ముందే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆమె హెచ్చరించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అరవ శ్రీధర్ లైంగిక వేధింపులకు సంబంధించి తాను ఎన్ని వీడియోలను రిలీజ్ చేసిన జన సేన పార్టీ తన సమస్యను పట్టించుకోలేదని, పవన్ కళ్యాణ్ తనకు న్యాయం చేయలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అధిష్టానం ఆదే శాలను ధిక్క రించి కార్యక్రమాలలో పాల్గొంటున్న అరవ శ్రీధర్‌కు, జనసేన పార్టీకి విలువలు లేవా? అంటూ ఆమె ప్రశ్నించింది.