Reading Time: 2 minutes

Sunrisers Hyderabad: టైటిల్ వేటలో సన్‌రైజర్స్ హైదరాబాద్.. జట్టు బలం, బలహీనతలు ఇవే

Caption of Image.

Sunrisers Hyderabad: మరో రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో టైటిల్‌పై గురి పెట్టింది. చివరగా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీలో 2016లో ఎస్ఆర్హెచ్ టైటిల్ అందుకుంది. అనంతరం 2018, 2024 సీజన్లలో ఫైనల్ వరకు వెళ్లినా విజేతగా నిలవలేదు.. గతేడాది పేలవ ప్రదర్శనతో 6వ స్థానంతో సరిపెట్టుకుంది. ఈ సారైనా మెరుగైన ప్రదర్శనతో టైటిల్ కొట్టాలనే కసితో ఉంది. ఫిట్‌నెస్ సమస్యలతో ప్యాట్ కమిన్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరం కావడంతో టీమ్ కి గట్టి షాక్ తగిలింది. విధ్వంసకరమైన బ్యాటింగ్ ఉన్నా, బౌలింగ్ విభాగం మాత్రం బలహీనంగా కనిపిస్తుంది. కమిన్స్ లేని లోటును తీర్చే బౌలర్ ఎవరు కనిపించడం లేదు?.. అంతేకాకుండా వేలంలోకి వదిలేసిన మహమ్మద్ షమీ స్థానాన్ని భర్తీ చేసే పేసర్ ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిలిగిపోయింది. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ 250+ పరుగులు చేసినా మ్యాచ్ గెలిచే ప్రసక్తి లేదని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఇప్పటికే చెప్పాడు. విధ్వంసకర బ్యాటర్లు జట్టులో ఉంటే, ఆల్‌టైమ్ రికార్డు స్కోర్లు నమోదు అవుతాయి.. కానీ జట్టు గెలుస్తుందా? అంటే చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. గత ఎడిషన్‌లోనూ పేలవ బౌలింగ్ సన్‌రైజర్స్ విజయవకాశాలను బాగా దెబ్బతీసింది. ప్రాక్టీస్‌లో ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లే దూకుడుగా ఆడి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ క్రమంలోనే దూకుడే జట్టుకు బలం, బలహీనతగా మారిందనే టాక్ వినిపిస్తుంది. గత సీజన్లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్లాట్ పిచ్‌లపై ఆడిన మ్యాచ్‌ల్లో విజయం సాధించినా.. స్లో వికెట్స్‌పై దారుణంగా ఓడింది. కాస్త నెమ్మదిగా ఉన్న పిచ్‌పై ఎస్ ఆర్ హెచ్ బ్యాటర్లు విఫలం కాగా,  బౌలర్లు పూర్తిగా చేతులెత్తేస్తున్నారు.

►ALSO READ | SRH vs LSG Tickets: ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్: 5 అంటే ఐదు నిమిషాల్లో టికెట్లు క్లోజ్.. వెయిట్ చేసినంతసేపు పట్టలేదు నిరుత్సాహానికి..

ఈ సమస్యను అధిగమించేందుకే సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ బౌలర్లను మినీ వేలంలో దక్కించుకుంది. స్మరణ్ రవిచంద్రన్, హర్ష్ దూబె, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగె, శివమ్ మావి, సకిబ్ హుస్సేన్, క్రైనిస్ ఫులెట్రా వంటి వారిని కొనుగోలు చేసింది. కానీ ఇందులో మెజార్టీ ప్లేయర్స్ కి ఒక్క ఐపీఎల్ మ్యాచ్ ఆడిన అనుభవం కూడా లేదు. వీళ్లలో ఏ ఇద్దరు అసాధారణ ప్రదర్శన చేసినా సన్‌రైజర్స్ బౌలింగ్ కష్టాలు తీరిపోయినట్లే.. లేదంటే ఈసారి కూడా జట్టు ప్లే ఆఫ్స్ చేరకుండా కష్టమే అని చెప్పాలి. 

©️ VIL Media Pvt Ltd.