
తెలంగాణ సెక్రటేరియట్, లుంబినీ పార్క్ వద్ద బైక్‌లతో ప్రమాదకర స్టంట్లు చేసిన ఇద్దరు యువకులను సైఫాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ముషీరాబాద్, బోలక్‌పూర్‌కు చెందిన మహ్మద్ అఖీల్ కొరియర్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు, నాంపల్లికి చెందిన మహ్మద్ అతీక్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇద్దరు యువకులు సోషల్ మీడియాలో రీల్స్ కోసం సెక్రటేరియట్, లుంబినీ పార్క్ వద్ద బైక్‌లతో స్టంట్లు చేశారు.నిందితులు సోషల్ మీడియాలో పాపులర్ అయ్యేందుకు తమ మోటారు సైకిళ్లపై బాధ్యతారహితంగా స్టంట్లు చేస్తున్నారు.
సెక్రటేరియట్ వంటి అత్యంత భద్రత కలిగిన ప్రాంతాల్లో వీరు స్టంట్లతో సాధారణ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది కలిగించారు. వీరి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సైఫాబాద్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్టు చేశారు. బైక్‌లు, వీడియోలు,మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు.సైఫాబాద్ ఇన్స్‌స్పెక్టర్ సీతయ్య, ఎస్సై వి. పరమేశ్వరి, పోలీసు సిబ్బంది, ఎల్. సంపత్ కుమార్, బి. విజయ్ కుమార్, జె. లింగస్వామి, ఎస్. మహేష్ అరెస్టు చేశారు.