
వాడీవేడిగా సాగనున్న అసెంబ్లీ సాయంత్రం
5 గంటలకు అసెంబ్లీ కమిటీ హాల్‌లో మంత్రివర్గం
భేటీ ఫ్రొఫెసర్ కోదండరామ్, అజహరుద్దీన్‌ల
ఎంఎల్‌సి ఎన్నిక అంశంపై చర్చ
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం (23) నుం చి బడ్జెట్‌పై చర్చ ప్రారంభంకానున్నది. వివిధ శాఖల పద్దులపై సభ్యులు చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఈ నె ల 20వ తేదీన అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా, అదే సమయంలో కౌన్సిల్‌లో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్‌కుమార్ రెడ్డి బడ్జెట్‌ను సభ ఆమోదం కోసం ప్ర వేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా, సోమవా రం నుంచి ఉభయ సభల్లో బడ్జెట్‌పై చర్చ ప్రా రంభమవుతుంది. అంతకుముందు యధావిధిగా ప్రశ్నోత్తరాల సమయం ఉంటుంది. బడ్జెట్ పై 30న అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదిస్తాయి.
ఇదిలాఉండగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు రాష్ట్ర బేవరేజస్ కార్పొరేషన్ (2018-2019)కు సంబంధించిన ఐదవ వార్షిక నివేదికను సభ ముందు ఉంచుతారు. ఇంకా రాష్ట్ర వై ద్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ వై ద్య విధాన పరిషత్‌కు సంబంధించిన సవరణ బిల్లు- 2026ను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (రెగ్యులేషన్ ఆఫ్ అప్పాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్, రేషనలైజేషన్ ఆఫ్ స్టాఫ్)కు సంబంధించి (మూడవ సవరణ) బిల్లును సభ ఆమోదం కోసం ప్రవేశపెడతారు.
నేడు సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీ కమిటీహాల్ మంత్రివర్గ సమావేశం
నేడు సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీ కమిటీహాల్ మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో భాగంగా పలు అంశాలపై కీలక చర్చ జరుగనుంది. ఎమ్మెలీగా అజహరుద్దీన్‌కు అవకాశం కల్పించడం గురించి చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అజహరుద్దీన్ మంత్రిగా అక్టోబర్ 31వ తేదీ 2025లో బాధ్యతలు స్వీకరించి ఏప్రిల్ 30వ తేదీకి ఆరునెలలు పూర్తికానున్న నేపథ్యంలో ఈ అంశం గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిసింది. దీంతోపాటు కోదండరాం, అజహరుద్దీన్‌ల ఎమ్మెల్సీల ఎన్నికకు సంబంధించిన అంశం ప్రస్తుతం గవర్నర్ వద్ద పెండింగ్ ఉండడం దీనిపై ఎలా ముందుకెళ్లాలన్న అంశాన్ని చర్చించనున్నట్టుగా సమాచారం. గవర్నర్‌ను మరోసారి కలిసి ఈ విషయమై విన్నవించే అంశాన్ని కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది. అసెంబ్లీలో కొన్ని బిల్లులను ఆమోదించుకోవాల్సి ఉన్నందున వాటిపై కేబినెట్ భేటీలో చర్చించి ఆమోదించుకునే అవకాశం ఉందని సమాచారం.