Reading Time: < 1 minute

వాషింగ్టన్:  అమెరికా అధ్యక్షలు డొనాల్డ్ ట్రంప్ తమ అధికారిక ప్రత్యేక విమానం ఎయిర్‌ఫోర్స్ ఒన్ నుంచి తడబడుతూ పక్కన ఊతం పట్టుకుని జాగ్రత్తగా దిగారు. దీనితో ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి పలు వార్తలు వెలువడ్డాయి. తరువాత అక్కడ ఉన్న కుర్చీపై ఆసీనుడు కావడానికి కూడా కంగారుపడాల్సి వచ్చింది. 79 సంవత్సరాల ట్రంప్ నాడీ మండల సమస్యలు ఎదుర్కొంటున్నాయని, రక్తనాళాలు గడ్డకట్టుకుపోతున్నాయని చాలాకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. ఎయిర్‌ఫోర్స్ ఒన్ నుంచి అతికష్టం మీద దిగినట్లుగా ఆయనను అనుసరించిన వీడియో కెమెరాలతో స్పష్టం అయింది. ట్రంప్ వయస్సు మీదపడింది. ఇక సరిగ్గా నడవలేకపోతున్నారనే వ్యాఖ్యలు వెలువడ్డాయి. అయితే ఇటువంటి విషయాలను పెద్దగా పట్టించుకోరాదని, ఆయన ఆరోగ్యంపై వదంతుల్లో ఇవో భాగం అని కొందరు ఎదురుదాడికి దిగారు. ట్రంప్ ఇప్పుడు ఫ్లోరిడాలో రెండు మూడు రోజులు గడుపనున్నారు. తరువాత టెన్సెసీకి వెళ్లి అక్కడి నుంచి తిరిగి వాషింగ్టన్ చేరుకుంటారు. ప్రస్తుతం ట్రంప్ ఆలోచనాశక్తి కూడా మునుపటిలా లేదని విమర్శలు తలెత్తుతున్నాయి.