Reading Time: 2 minutes

టెహ్రాన్: గల్ఫ్‌ దేశాలకు ఇరాన్‌ మరోసారి హెచ్చరికలు పంపింది. గల్ఫ్‌లోని పర్యాటక కేంద్రాలను టార్గెట్‌ చేస్తామని హెచ్చరించింది. పార్కులు, వినోద కేంద్రాలు, టూరిస్ట్ డెస్టినేషన్స్‌పై దాడులు చేస్తామని ఇరాన టాప్‌ మిలిటరీ కమాండర్‌ జనరల్‌ షెకార్చి స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. మిడిల్‌ ఈస్ట్‌లో పెరుగుతున్న టూరిజంను దెబ్బకట్టే ప్లాన్ లా కనిపిస్తుంది. ఇజ్రాయెల్‌ నివాస సముదాయాలనూ టార్గెట్‌ చేసే అవకాశం ఉంది. బాగ్దాద్‌లోని అమెరికన్‌ ఎంబసిపై మరోసారి దాడులు చేశారు. ఇరాన్‌ మిస్సైళ్లతో విరుచుకుపడింది.  హిందూ మహాసముద్రంపై ఇరాన్ రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా-బ్రిటన్ సైనిక స్థావరమే లక్షంగా క్షిపణులను ఇరాన్ వదిలింది. కానీ 4000 కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఢీకొనలేక మధ్యలోనే ఒక క్షిపణి కూలిపోయింది. మరొక క్షిపణిని అమెరికా వైమానిక విభాగం అడ్డుకొని కూల్చివేసింది. 

పశ్చిమ యుద్ధం అత్యంత భీకర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఆయా దేశాల్లోని సైనిక, వైమానిక, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యక్తులనే లక్ష్యంగా చేసుకున్న ఇరు పక్షాలు తాజాగా ఆర్థిక మూలాలను టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇజ్రాయె ల్ తన కీలక సహజ వాయు క్షేత్రంపై దాడి చేసిన నేపథ్యంలో, ఇరాన్ ప్రతీకార చర్యల ను మరింత ముమ్మరం చేసింది.  గల్ఫ్ ప్రాంతంలోని పలు ఇంధన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడులు జరిపింది. సౌదీ అరేబియాలోని ఎర్ర సముద్ర తీరంలోని రిఫైనరీపై దాడి చేయగా ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ కేంద్రాల్లో, కువైట్‌లోని రెండు చమురు శుద్ధి కర్మాగారాల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి.

ఈ పరిణామాలు మధ్యప్రాచ్య యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేశాయి. ఖతార్ రాజధాని దోహాకు దగ్గర్లోని రస్ లఫాన్‌లో ఉన్న అత్యంత భారీ గ్యాస్ చమురు క్షేత్రంపై దాడి చేసింది. ఇక్కడి నుంచే ఆసియా, ఐరోపా ఖండాలకు భారీ మొత్తంలో ఎగుమతులు జరుగుతుంటాయి. ప్రపంచంలోనే అతిపెద్ద సహజ వాయు క్షేత్రంగా భావించే సౌత్ పార్స్‌పై ఇజ్రాయెల్ దాడి చేయడం ఇరాన్ దాడులకు దారి తీసింది. ఇరాన్ విద్యుత్ ఉత్పత్తిలో సుమారు 80 శాతం దీనిపైనే ఆధారపడటం వల్ల, ఈ దాడి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. కువైట్‌లోని మీనా అల్- అహ్మది రిఫైనరీపై డ్రోన్ దాడితో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా, సమీపంలోని మీనా అబ్దుల్లా రిఫైనరీ కూడా మంటల్లో చిక్కుకుంది. సౌదీలోని అరామ్ కో రిఫైనరీపై కూడా ఇరాన్ డ్రోన్ దాడి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీరానికి సమీపంలో ఒక నౌక అగ్నికి ఆహుతైన విషయం తెలిసిందే.