Reading Time: < 1 minute
Why Dsp And Thaman Skipped The Ustaad Bhagat Singh Pre Release Event

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న రాత్రి అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా నిర్వహించారు. వేలాది మంది అభిమానులు తరలివచ్చిన ఈ వేడుకలో ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఈ చిత్రానికి సంగీతం అందించిన ‘రాక్ స్టార్’ దేవిశ్రీ ప్రసాద్ అలాగే నేపధ్య సంగీతం అందించిన తమన్ ఈ ఈవెంట్ కి దూరంగా ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

Also Read : Bollywood : సినిమా వసూళ్లు దేశ జనాభా కంటే ఎక్కువ ఉంటున్నాయి.. ప్రియదర్శన్ వైరల్ కామెంట్స్!

 సాధారణంగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఏ సినిమా వేడుక అయినా, ఆయన తన మార్క్ ఎనర్జీతో, అదిరిపోయే స్టేజ్ పెర్ఫామెన్స్‌లతో సందడి చేస్తుంటారు. కానీ ఉస్తాద్ ఈవెంట్‌లో ఆయన కనిపించకపోవడంతో అభిమానులు కాస్త నిరాశ చెందారు. దీనికి తోడు, ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్న ఎస్.ఎస్. తమన్ కూడా ఈ వేడుకలో కనిపించలేదు. ఇద్దరు ప్రముఖ సంగీత దర్శకులు ఒకేసారి గైర్హాజరు కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.  డీఎస్పీ గైర్హాజరుపై ఫిల్మ్ నగర్ వర్గాల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సాంగ్స్ డీఎస్పీ కంపోజ్ చేసినప్పటికీ, బీజీఎమ్ బాధ్యతలు తమన్‌కు అప్పగించడం పట్ల దేవిశ్రీ ప్రసాద్ అసంతృప్తిగా ఉన్నారని, అందుకే ఈవెంట్ కు రాలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, తాను మ్యూజిక్ డైరెక్ట్ చేయని సినిమా వేడుకకు రావడం ఎందుకనే ఉద్దేశంతో తమన్ కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా, ఉస్తాద్ వేడుకలో ఈ మ్యూజిక్ మ్యాజిక్ మిస్ అవ్వడం పట్ల సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది.