సంజూ ఆడితే.. బయట కూర్చోబెట్టేది ఎవరిని..? భారత్ ప్లేయింగ్ XIపై హైటెన్షన్!

Team India Playing XI: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో చివరి పోరు ఈరోజు (శనివారం) హాంప్‌షైర్‌లోని వెస్ట్ ఎండ్‌లో ఉన్న రోజ్ బౌల్ క్రికెట్ మైదానంలో జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ను 3–0తో చేజార్చుకున్న టీమిండియాకు ఇది కేవలం పరువుని కాపాడుకునేందుకు ఒక మంచి అవకాశం మాత్రమే.. ఎలాగైనా భారత్‌ను క్లీన్ స్వీప్ చేసి హిస్టారికల్ రికార్డ్ సృష్టించాలనే కసితో ఇంగ్లాండ్ బరిలోకి దిగుతోంది. ఈ క్రమంలోనే జట్టు సెలెక్షన్‌పై, స్టార్ బ్యాటర్ సంజు శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై నెట్టింట రచ్చ రంబోలా జరుగుతోంది.
సంజు కోసం త్యాగం చేసేది ఎవరు?:
జట్టులో మార్పుల విషయానికొస్తే భారత టాప్ ఆర్డర్‌లో మార్పులు జరిగే అవకాశాలు పెద్దగా కనిపించడం లేదు. ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం చేసిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ 3 ఇన్నింగ్స్‌ల్లో ఆశించిన స్థాయిలో రన్స్ చేయనప్పటికీ, ఐపీఎల్ ప్రదర్శన, అతనికున్న హైప్ దృష్ట్యా మేనేజ్‌మెంట్ మరికొన్ని అవకాశాలు ఇచ్చేలా కనిపిస్తోంది. మరోవైపు ఐసీసీ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటి, రెండు స్థానాల్లో కొనసాగుతున్న ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలను డ్రాప్ చేయడం అసాధ్యం.. కానీ సంజు శాంసన్‌ను తిరిగి జట్టులోకి తీసుకురావాలంటే మిడిల్ ఆర్డర్‌లో ఎవరో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయక తప్పదు.
వైస్ కెప్టెన్ తిలక్ వర్మపై వేటు:
ప్రస్తుతం భారత బ్యాటింగ్ ఆర్డర్‌లో విపరీతమైన మార్పులు కనిపిస్తుండటంపై ఒత్తిడి పెరిగింది. నాలుగో స్థానంలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వస్తుండగా, ఐదో స్థానం కోసం శివమ్ దూబే, అక్షర్ పటేల్‌లను మార్చి మార్చి పంపుతున్నారు. ఈ సిరీస్‌లో ఘోరంగా విఫలమవుతున్న వైస్ కెప్టెన్ తిలక్ వర్మను జట్టు నుంచి తొలగించాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తున్నప్పటికీ, అతనికి మేనేజ్‌మెంట్ మరో ఛాన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ సంజు శాంసన్ జట్టులోకి వస్తే ఆల్‌రౌండర్లు అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్‌లలో ఒకరిపై వేటు పడే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్‌లో అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ దారుణంగా నిరాశపరిచిన దూబేను పక్కన పెట్టినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు
ఇరు జట్ల స్క్వాడ్స్ ఇవే:
భారత జట్టు: కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, సంజు శాంసన్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, అక్షర్ పటేల్, శివమ్ దూబే, సూర్యాంష్ షెడ్గే, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, ప్రిన్స్ యాదవ్
ఇంగ్లాండ్ జట్టు: కెప్టెన్ హ్యారీ బ్రూక్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), ఫిల్ సాల్ట్, జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కరన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, సాకిబ్ మహమూద్, ఆదిల్ రషీద్, ల్యూక్ వుడ్