మస్త్ షేడ్స్ ఉన్నాయిరా కమలాసన్: రైల్వేస్టేషన్లో యువతి కాళ్లు పట్టుకుని వదల్లేదు.. ప్రేమనా.. నాటకమా..!

ముంబై: జనంతో రైల్వే స్టేషన్ రద్దీగా ఉంది. ప్రయాణికులు ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంతలో ఓ యువకుడు సడెన్‌గా ప్లాట్‌ఫామ్‌పై పడుకుని ఓ యువతి కాళ్ళు మీద పడ్డాడు. ఈ ఊహించని పరిణామంతో మొదట్లో నిర్ఘాంతపోయిన సదరు యువతి.. వెంటనే షాక్ నుంచి తేరుకుని యువకుడి చెర నుంచి కాళ్లు విడుపించుకునేందుకు ప్రయత్నించింది.
కానీ మనోడు మాత్రం ఎంతకు కాళ్లు వదలకుండా అలాగే ప్రాధేయపడ్డాడు. అతడు ఎందుకు యువతి కాళ్ల పట్టుకున్నాడో.. ఏం అడిగాడో తెలియదు కానీ.. ముంబైలోని బోరివాలి రైల్వే స్టేషన్‌లో జరిగింది ఈ ఘటన. వెంటనే రంగంలోకి దిగిన ఆర్పీఎఫ్ మహిళా పోలీసులు అమ్మాయిని అతడి చెర నుంచి వదిలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియా మాత్రం సోషల్ మీడియాలో తెగా వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు దీనిని బహిరంగ డ్రామా అని అభివర్ణి్స్తుండగా.. మరికొందరు మనోడిది నిజమైన.. ప్రేమ ఒక భయంకరమైన విషయం.. ఇంతకుమించి ప్రేమించే వారు ఎక్కడైన దొరుకుతారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఇలాంటి న్యూసెన్స్ ఏంటని మరికొందరు పెదవి విరుస్తున్నారు. సదరు యువకుడిపై చర్యలు తీసకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు, ముంబై పోలీసులు ఇప్పటి వరకు స్పందించలేదు. ఇన్స్‌స్టా గ్రామ్‌లో ఈ వీడియాకు 6 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం గమనార్హం.