షాబాద్ ఘటన.. సైకో రాజ్‌కుమార్ ఆచూకీ చెబితే రూ. 2 లక్షలు ఇస్తాం.. ఫ్యూచర్ సిటీ పోలీసుల కీలక ప్రకటన

రంగారెడ్డి జిల్లా షాబాద్ ఘటన కేసును సీరియస్‌గా తీసుకున్న ఫ్యూచర్ సిటీ పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఆరు హత్యల కేసులో ప్రస్తుతం పరారీలో ఉన్న సైకో నిందితుడు రాజ్‌కుమార్ ఆచూకీ తెలిపిన వారికి లేదా అతడి అరెస్టుకు సహకరించేలా సమాచారం అందించిన వారికి రూ. 2 లక్షల నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచుతామని పోలీసులు స్పష్టం చేశారు.
మైనర్ పై అత్యాచార వేధింపుల ఆరోపణలతో.. పోక్సో కేసులో అరెస్టెన రాజ్ కుమార్ .. బెయిల్ పై బయటికొచ్చి ఆరుగురిని చంపేశాడు . శుక్రవారం (జులై 10) అర్థరాత్రి రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది.
కిరాతకకుడు.. మొదటగా ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు పిల్లలను కత్తితో పొడిచి హత్య చేశాడు. ఆ తర్వాత పోక్సో కేసు పెట్టిన బాధిత బాలిక కుటుంబంలో మరో ముగ్గురిని హత్య చేశాడు. బాలికను వేధించినందుకు రాజ్ కుమార్ పై మే 16న పోక్సో కేసు నమోదైంది. మే 26న అరెస్ట్ అయి జైలుకెళ్లిన దుర్మార్గుడు.. శుక్రవారం (జులై 10) బెయిల్పై తిరిగి వచ్చి అత్యంత కిరాతకంగా దారుణానికి ఒడిగట్టాడు. ఇంటికి వెళ్లి తన భార్య, ఇద్దరు పిల్లల హత్య చేశాడు. ఆ తర్వాత బాధిత బాలిక, బాలిక తల్లి, నాయనమ్మలను హత్య చేశాడు. బాలికను ఊరి శివారల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆపై హత్య చేశాడు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు.