Reading Time: < 1 minute

జానకమ్మ మరణం..భారతీయ సంగీత ప్రపంచానికి తీరని లోటు: సీఎం రేవంత్ రెడ్డి

Caption of Image.

లెజెండరీ సింగర్,  గానకోకిల ఎస్.జానకి మృతిపట్ల సీఎం రేవంత్  రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. దక్షిణ భారత సీని సంగీత ప్రపంంలో జానిక తన గళ మాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.వేలాది సినిమాల్లో  సన్నివేశాలకు, సందర్భంగా అనుగుణంగా నవరసాలు పలికిస్తూ జానకి పాడిన పాటలు శ్రోతలను మంత్ర ముగ్దులను చేశాయన్నారు.  తెలుగు చిత్ర పరిశ్రమ అభిమానులు జానకమ్మ అని ఆప్యాయంగా పిలుచుకునే ఆమె తెలుగు వారు కావడం తెలుగు ప్రజలకు గర్వకారణమన్నారు.

తెలుగు, తమిళం, హిందీతోపాటు మొత్తం 17 భాషల్లో 48వేలకు పైగా పాటలు పాడి ఎన్నో జాతీయ పురస్కారాలను అందుకున్నారని సీఎం గుర్తు చేశారు. జానకమ్మ మరణం భారతీయ చలన చితర పరిశ్రమకే కాదు..  కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటని అన్నారు. భగవంతుడు వారి ఆత్మకు శాంతి చేకూర్చాలన  ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

©️ VIL Media Pvt Ltd.