July 12, 2026

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీకు డబ్బులు కట్..

PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీకు డబ్బులు కట్..
Reading Time: 2 minutes
PM Kisan: పీఎం కిసాన్ లబ్దిదారులకు అలర్ట్.. ఈ పని చేయకపోతే మీకు డబ్బులు కట్..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతీ ఏడాది దేశవ్యాప్తంగా లక్షలాది మంది రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోన్న విషయం తెలిసిందే. అర్హులైన రైతులకు ప్రతి సంవత్సరం రూ. 6,000 చొప్పున మూడు సమాన వాయిదాల్లో రూ. 2 వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తోంది. అయితే గత నెలలో విడుదలైన 23వ వాయిదాను చాలా మంది లబ్ధిదారులు అందుకోలేదు. మీ చెల్లింపు ఇంకా పెండింగ్‌లో ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. చాలా సందర్భాలలో పత్రాలు లేదా ఖాతా వివరాలలో చిన్న పొరపాట్ల కారణంగా డబ్బు నిలిచిపోతుంది. 24వ వాయిదా విడుదల కావడానికి ముందే ఈ పొరపాట్లను సరిదిద్దుకోవడం ద్వారా మీరు పెండింగ్‌లో ఉన్న మొత్తంతో పాటు తదుపరి చెల్లింపును కూడా పొందవచ్చు. అదెలా అనేది ఒకసారి చూద్దాం.

బ్యాంక్ వివరాలు చెక్ చేసుకోండి

అసంపూర్తిగా ఉన్న ఇ-కేవైసి అతిపెద్ద కారణాలలో ఒకటిగా చెప్పవచ్చు. కేవైసీని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. తప్పుడు అకౌంట్ నంబర్ లేదా IFSC కోడ్ వంటి సరికాని బ్యాంకు ఖాతా వివరాలు వల్ల కూడా మీకు డబ్బులు అందకపోవచ్చు. అలాగే ఆధార్, బ్యాంకు రికార్డులు, పీఎం కిసాన్ దరఖాస్తులో మీ పేరు లేదా ఇతర వ్యక్తిగత వివరాలలో తేడాలు ఉండటం ధృవీకరణ సమస్యలను సృష్టించవచ్చు. ఇక మీ భూమి రికార్డులు ధృవీకరించబడకపోతే మీ చెల్లింపు కూడా పెండింగ్‌లో ఉండవచ్చు. మీకు గత ఏడత డబ్బుల అందకపోతే వీలైనంత త్వరగా తప్పులను సరిదిద్దుకోవాలి.

సమస్య తెలుసుకోవడం ఎలా..?

-అధికారిక పీఎం కిసాన్ వెబ్‌సైట్‌ను సందర్శించండి
– మీ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ‘ఫార్మర్ కార్నర్’ విభాగానికి వెళ్లండి.
– మీ ప్రొఫైల్‌ను జాగ్రత్తగా తనిఖీ చేయండి
– తప్పుగా లేదా అసంపూర్తిగా ఉన్న సమాచారాన్ని అప్డపేట్ చేయండి.
– పెండింగ్‌లో ఉన్న ఇ-కేవైసీని పూర్తి చేయడం, బ్యాంకు ఖాతా వివరాలను సరిదిద్దుకోవడం, మీ వ్యక్తిగత సమాచారం అధికారిక రికార్డులతో సరిపోలుతోందని నిర్ధారించుకోవడం వంటివి చేయడం వల్ల తదుపరి వాయిదాను ఎలాంటి ఆలస్యం లేకుండా అందుకోవచ్చు

24వ విడత అందుకోవాలంటే..?

మీరు తదుపరి చెల్లింపుల సమయానికి ముందే పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించుకోండి. దీంతో ఆలస్యమైన 23వ వాయిదాతో పాటు రాబోయే 24వ వాయిదాను కూడా పొందవచ్చు. అందుకే లబ్ధిదారులు చివరి నిమిషం వరకు వేచి ఉండకూడదు. ఇప్పుడే మీ దరఖాస్తు స్థితిని తనిఖీ చేసుకోండి. అవసరమైన వివరాలను అప్డేట్ చేసుకోండి