మళ్లీ టాస్ గెలిచిన భారత్.. ఈసారి సంజు ఎంట్రీ.. ఫస్ట్ బ్యాటింగ్ ఇంగ్లాండ్దే

IND vs ENG 5th T20I: సౌతాంప్టన్ వేదికగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతన్న ఐదో టీ20 మ్యాచ్ టాస్ పడింది. ఈ చారిత్రాత్మక పోరులో టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ (India opted to field) తీసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్ గెలిచి ఐసీసీ ర్యాకింగ్స్ లో నెంబర్ స్థానాన్ని దక్కించుకోవాలని ఇంగ్లాండ్ చూస్తుండగా, ఇంగ్లీష్ జట్టుని ఓడించి, పరువు కాపాడుకోవాలని టీమిండియా చూస్తుంది.
భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. పిచ్ పరిస్థితి మ్యాచ్ గడిచేకొద్దీ పెద్దగా మారదని, ఇంగ్లాండ్ నిర్దేశించే లక్ష్యాన్ని చేజ్ చేయడానికే తాము మొగ్గు చూపుతున్నట్లు తెలిపాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయినప్పటికీ, గతంలో జరిగిన పరాజయాల గురించి ఆలోచించకుండా ఆటగాళ్లు మంచిగా ఆడాలని చెప్పుకొచ్చాడు. ఇక తుది జట్టులో భారత్ రెండు కీలక మార్పులు చేసింది. గత కొన్ని మ్యాచ్‌లుగా బెంచ్‌కే పరిమితమైన సంజు శాంసన్ తో పాటు సూర్యాంష్ షెడ్గేకు ప్లేయింగ్ 11లో అవకాశం కల్పించినట్లు శ్రేయస్ వెల్లడించాడు.
ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్‌లో గెలిస్తే తాము ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్ వన్ స్థానానికి చేరుకుంటామని, ఆ ఆలోచన తన మనస్సులో బలంగా నాటుకుపోయిందని బ్రూక్ చెప్పుకొచ్చాడు. భారత్‌ను 4–0తో క్లీన్ స్వీప్ చేసి అగ్రస్థానాన్ని దక్కించుకోవడమే తమ ఏకైక లక్ష్యమని తేల్చి చెప్పాడు. ఇంగ్లాండ్ జట్టు ఎలాంటి మార్పులు లేకుండా అదే విన్నింగ్ కాంబినేషన్‌తో బరిలోకి దిగుతోందని హ్యారీ పేర్కొన్నాడు.
ఇరు జట్లు:
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్( కెప్టెన్), తిలక్ వర్మ, శివమ్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ
ఇంగ్లాండ్: ఫిలిప్ సాల్ట్, జోస్ బట్లర్(వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్(కెప్టెన్), జాకబ్ బెథెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, జోష్ టంగ్
🚨 Toss 🚨#TeamIndia have won the toss and elected to bowl first in Southampton.
Updates ▶️ https://t.co/7mo5osv0MW#ENGvIND pic.twitter.com/qAQj6cvYSA
— BCCI (@BCCI) July 11, 2026
Presenting #TeamIndia‘s Playing XI for the 5️⃣th and final T20I 🙌
Updates ▶️ https://t.co/7mo5osv0MW#ENGvIND pic.twitter.com/uSVKJB5raY
— BCCI (@BCCI) July 11, 2026