Reading Time: < 1 minute
Anubrata Mondal Joins Tmc Rebel Camp

TMC CRISIS: వరస ఎదురుదెబ్బలతో తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కుదేలవుతోంది. మమతా బెనర్జీకి వరస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్ నేత, బీర్భూమ్ జిల్లాలో పార్టీకి ప్రధాన నాయకుడిగా గుర్తింపు పొందిన, మమతకు అత్యంత సన్నిహితుడిగా ఉన్న అనుబ్రత మెండల్ శనివారం తిరుగుబాటు వర్గంలో చేశారు. రీటబ్రత బెనర్జీ వర్గంలో చేరిన వెంటనే ఆయనను బీర్భూమ్ జిల్లా అధ్యక్షుడిగా నియమించారు.

మాజీ డిప్యూటీ స్పీకర్ ఆశిష్ బంద్యోపాధ్యాయ్‌తో జరిగిన చర్చల అనంతరం అనుబ్రత మెండల్ రెబల్ వర్గంలో చేరినట్లు సమాచారం. మూడున్నర దశాబ్ధాలుగా రాజకీయాల్లో్ ఉన్న అనుబ్రత మెండల్ ఇప్పటి వరకు ఏ ఎన్నికలోనూ పోటీ చేయలేదు. అయితే తెరవెనక టీఎంసీ వ్యూహకర్తగా, పార్టీ విస్తరణలో కీలక పాత్ర పోషించారు. ఇటీవ అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ తీసుకున్న నిర్ణయాలపై అనుబ్రత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్‌తో విభేదాలు పెంచుకోవడం సరైన నిర్ణయం దాని అభిప్రాయం వ్యక్తం చేశారు.