Lenin Movie Collections: అయ్యగారే నెంబర్ వన్.. బాక్సాఫీస్ రికార్డ్స్ బద్దలుకొట్టిన అఖిల్.. లెనిన్ కలెక్షన్స్ ఎంతంటే..

అక్కినేని అఖిల్ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే కథానాయికగా నటించింది. శుక్రవారం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఉదయం నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ క్రేజీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాను చూసేందుకు అడియన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. ఇక మొదటి రోజే ఈ సినిమాకు ఊహించని స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా ఈ మూవీ బాక్సాఫీస్ లెక్కలు అధికారికంగా ప్రకటించారు మేకర్స్. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ గురించి చెబుతూ.. చిత్ర నిర్మాణ సంస్థ లెనిన్ మూవీ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ అధికారిక పోస్టర్ రిలీజ్ చేసింది.
ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
లెనిన్ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.16.7 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. అఖిల్ కెరీర్ లోనే ఎంట్రీ ఇచ్చి పదేళ్లు పూర్తైనా ఇప్పటివరకు సరైన హిట్టు పడలదనే వెలితిని ఈ సినిమా తుడిచేసింది. సినిమా ప్రారంభం నుంచే అఖిల్ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
ఈ చిత్రానికి జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్, ఇంటర్వెల్ ట్విస్టులు ప్రేక్షకులను ఆద్యంతం మెప్పిస్తున్నాయి. ఇక ఇప్పుడు రెండవ శనివారం, ఆదివారం కావడంతో ఈ సినిమా వసూళ్లు మరింత పెరగడం ఖాయమని తెలుస్తోంది. ముఖ్యంగా ఈచిత్రానికి ప్రధాన బలం స్క్రీన్ ప్లే అని సినీ విశ్లేషకులు అంటున్నారు. పక్కా మాస్ ఎలిమెంట్స్, స్క్రీన్ ప్లేతో విమర్శకులను మెప్పించాడు డైరెక్టర్ మురళీ కిషోర్ అబ్బూరి. ప్రస్తుతం ఈ మూవీ థియేటర్లలో దూసుకుపోతుంది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
లెనిన్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్..
AKHIL 2.0 is here… and the box office has heard it loud and clear
A phenomenal 16.7 CR+ Worldwide Gross on Day 1 for #LENIN
The Telugu audience has once again celebrated good cinema in the grandest way possible
#BlockbusterLENIN
@AkhilAkkineni8… pic.twitter.com/UOKexRK2CA
— Annapurna Studios (@AnnapurnaStdios) July 11, 2026
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..


