July 11, 2026

కోతుల గుంపుదాడి.. భయంతో మహిళకు గుండెపోటు.. చికిత్స పొందుతూ..

కోతుల గుంపుదాడి.. భయంతో మహిళకు గుండెపోటు.. చికిత్స పొందుతూ..
Reading Time: < 1 minute

కోతుల గుంపుదాడి.. భయంతో మహిళకు గుండెపోటు.. చికిత్స పొందుతూ..

Caption of Image.

మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. ఓ మహిళపై కోతుల గుంపు దాడి చేసింది.  ఒక్కసారిగా  కోతులు మీద పడటంతో భయంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా గుండెపోటుతో మృతిచెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. వివరాల్లోకి వెళితే.. 

మెదక్ జిల్లా కొల్చారం మండలం అప్పాజీపల్లిలో శనివారం(జూలై 11) ఉదయం ఈ దారుణం జరిగింది. ఇంటి ముందు ముగ్గే వేస్తున్న పద్మ (46) అనే మహిళపై కోతుల గుంపు ఒక్కసారిగా దాడి చేసింది. తప్పించుకునే క్రమంలో భయాందోళనకు గురైన పద్మ అపస్మారస్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు , స్థానికులు మెదక్ లోకి  ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే కోతుల దాడిలో పద్మ గుండెపోటుతో రావడంతో చనిపోయిందని డాక్టర్లు చెప్పారు. 

పొద్దున వరకు ఆరోగ్యంగా ఉత్సాహంగా తిరిగిన మహిళ అకస్మాత్తుగా చనిపోవడంతో కుటుంబ సభ్యులతో పాటు, గ్రామస్తులు తీవ్ర విషాదంలో మునిగారు.  గ్రామంలో కోతుల బెడదను నివారించాలని అధికారులు కోరుతున్నారు. 
 

©️ VIL Media Pvt Ltd.