Singer S Janaki: ఒకే పాట.. నాలుగు గొంతులు.. గానకోకిల జానకమ్మ అద్భుతం.. ఈ పాట విన్నారా..?

జానకమ్మ.. ఈ పేరు చెప్పగానే మధురమైన గాత్రం.. అలాగే అల్లరి చేస్తూ పాటలు పాడే చిన్నపిల్ల వాయిస్ గుర్తొస్తుంది. తన గాత్రంతో వేలాది పాటలు పాడి సినీ సంగీత ప్రపంచంలో కోట్లాది మంది అభిమానుల హృదయాలు గెలుచుకున్నారు. భారతీయ సంగీత ప్రపంచంలో గానకోకిల జానకమ్మ స్థానం అద్వితీయం. కేవలం పాట పాడటమే కాదు, ఆ పాటలోని పాత్రలకు అనుగుణంగా తన స్వరాన్ని మార్చడం (Voice Modulation) జానకమ్మకు వెన్నతో పెట్టిన విద్య. దీనికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుతమైన వీడియో ఇప్పుడు యూట్యూబ్‌లో సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది. “రావమ్మ దుర్గమ్మ” (Ravamma Durgamma) అనే ప్రైవేట్ భక్తి గీతంలో జానకమ్మ ఏకంగా నాలుగు విభిన్న గొంతులతో (4 Voices) పాడి శ్రోతలను ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది.
ఎక్కువ మంది చదివినవి :Tollywood : పెదరాయుడు సినిమా చిన్నోడు గుర్తున్నాడా.. ? ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరో.. ఫోటోస్ చూశారా..
ఈ ప్రత్యేకమైన వీడియో ఎస్ జానకి చిన్న పాప (Child), ఒక పురుషుడు (Male), ఒక సాధారణ స్త్రీ (Female), ఒక వృద్ధురాలి (Old Lady) గొంతులతో పాటను ఎంతో అందంగా అలరించారు. సాధారణంగా ఒకే పాటను వేర్వేరు గాయనీ గాయకులతో పాడించడం చూస్తుంటాం. కానీ, ఈ పాటలో మాత్రం ఆయా పాత్రల హావభావాలను, వయసు తారతమ్యాలను కేవలం తన స్వర వైవిధ్యంతోనే జానకమ్మ పలికించడం విశేషం. పాట ప్రారంభంలో ఒక పసిపాప అమాయకత్వంతో కూడిన గొంతుతో, ఆ తర్వాత ఒక పురుషుడి గంభీర స్వరంతో, అనంతరం ఒక స్త్రీ సహజమైన గొంతుతో ,చివరగా ఒక ముసలమ్మ గొంతులో ఉండే వణుకును, భక్తిని ఎంతో అద్భుతంగా మార్చి పాడారు. మైక్రోఫోన్ ముందు నిలబడి ఎలాంటి తడబాటు లేకుండా ఒక గొంతు నుంచి మరో గొంతులోకి ఆమె మారిన విధానం చూస్తే జానకమ్మను ఎందుకు లెజెండరీ సింగర్ అంటారో మనకు అర్థమవుతుంది.
ఎక్కువ మంది చదివినవి : Bigg Boss : బిగ్ బాస్‌లోకి యంగ్ హీరో భార్య.. వారానికి లక్షలకుపైనే రెమ్యునరేషన్.. ఫాలోయింగ్ మాములుగా లేదుగా..
సినిమాల్లో చిన్నపిల్లల పాత్రలకు, క్లాసికల్ సాంగ్స్‌కు వాయిస్ మార్చడం మనకు తెలిసిందే. అయితే ఈ భక్తి గీతంలో ఆమె ప్రదర్శించిన ‘ఫోర్ వాయిస్’ మేజిక్ నిజంగా ఒక అరుదైన ప్రయోగమనే చెప్పాలి. ఈ అద్భుతమైన వీడియో జానకమ్మలోని అసాధారణ ప్రతిభకు , ఆమె స్వర పరిణితికి మరొక్కసారి మచ్చుతునకగా నిలిచింది.
ఎక్కువ మంది చదివినవి : Trending Song: అప్పట్లో ఈ సాంగ్ ట్రెండ్ సెట్టర్.. 90’s కుర్రాళ్ల మతులు పోగొట్టిన పాట.. ఇప్పటికీ క్రేజ్ మామూలుగా లేదుగా.
జానకమ్మ పాడిన పాట..
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఒక గది.. ఐదుగురు మనుషులు.. ప్రతి సీన్ వణుకుపుట్టిస్తుంది.. ఓటీటీని షేక్ చేస్తున్న మైండ్ బ్లోయింగ్ మూవీ..