July 11, 2026

Health Tips: రోజంతా సిస్టమ్‌ ముందే కూర్చుంటున్నారా? జాగ్రత్త.. డేంజర్ వ్యాధికి వెల్‌కమ్ చెప్పినట్టే!

Health Tips: రోజంతా సిస్టమ్‌ ముందే కూర్చుంటున్నారా? జాగ్రత్త.. డేంజర్ వ్యాధికి వెల్‌కమ్ చెప్పినట్టే!
Reading Time: < 1 minute
Health Tips: రోజంతా సిస్టమ్‌ ముందే కూర్చుంటున్నారా? జాగ్రత్త.. డేంజర్ వ్యాధికి వెల్‌కమ్ చెప్పినట్టే!

ప్రస్తుత రోజుల్లో ప్రతి ఉద్యోగంలోనూ సిస్టమ్ ముందు కూర్చునే పనిచేయాల్సి వస్తుంది. దీంతో జనాల్లో శారీరక శ్రమ తగ్గి రకరకాల ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వస్తోంది. ఈ క్రమంలో కొందరు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జిమ్‌కు వెళ్లడం వర్కౌట్స్, యోగా, మెడిటేషన్, వ్యాయామం వంటివి చేస్తుంటారు. కానీ ఇటీవల విడుదలైన ఓ తాజా నివేదిక ప్రకారం.. రోజుకు మీరు 8 నుండి 10 గంటల పాటు నిరంతరంగా కుర్చీలోనే కూర్చునే పని చేస్తుంటే.. ఈ వర్కౌట్స్ మీకు అస్సలు సరిపోవని తాజా పరిశోదనలు చెబుతున్నాయి.

పరిశోధనలో ఏం తేలింది?

PLOS మెడిసిన్ అనే మెడికల్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక కొత్త పరిశోధనలో పరిశోధకులు 91 వేల కంటే ఎక్కువ మంది యువకుల ఆరోగ్య, జీవనశైలిని వరుసగా 12 ఏళ్ల పాటు పరిశీలించగా రోజూ 30 నిమిషాల కంటే ఎక్కువ టైం ఒకే చోట కూర్చునే వారిలో, కూర్చునే ప్రతి అదనపు గంటకు క్యాన్సర్ వల్ల మరణించే ప్రమాదం 10 శాతం పెరుగుతుందని ఈ పరిశీలనలో తేలింది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. జిమ్‌ వెళ్లి వర్కౌట్స్ చేసిన తర్వా రోజంతా నిరంతరాయంగా కూర్చొని పని చేసేవారికిలో కూడా సేమ్ ఇలాంటి ప్రమాదమే కనిపిస్తోందని పరిశోదకులు కనిపెట్టారు. అయితే ఈ సమస్యను తగ్గించుకోవాలంటే కూర్చునే పని తగ్గించి శారీరక శ్రమ పెంచాలని పరిశోదకులు చెబుతున్నారు.

ఎక్కవు మంది చదివినది: ఇన్నాళ్లు ఎలా మిస్సయ్యాం.. సిమ్‌ ఇన్‌జెక్టర్ పిన్‌ వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా!

కారణాలు ఏమిటి?

పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, ఒక వ్యక్తి గంటల తరబడి కూర్చున్నప్పుడు, కండరాల పనితీరు, కదలికలు చాలా మందగిస్తాయి. దీని వల్ల శరీర జీవక్రియ దెబ్బతింటుంది. శరీరంలో ఇన్సులిన్ నిరోధకత పెరుగుతుంది. అలాగే క్రానిక్ ఇన్ఫ్లమేషన్, బరువు పెరిగే సమస్యలు వస్తాయి. ఈ కారణాల వల్ల కాలక్రమేణా కొలొరెక్టల్, రొమ్ము క్యాన్సర్, ఎండోమెట్రియల్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఉందని చెబుతున్నారు. కాబట్టి మీరు చేసే పని ముఖ్యమైనదే అయినప్పటికీ.. ప్రతి అరగంటకోసారి లేచి కాసేపు తిరిగి కూర్చొంటి. ఇలా చేయడం వల్ల ప్రమాదం కాస్తైన తగ్గొచ్చు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి