July 11, 2026

ఇది కదా కుటుంబం అంటే..! ఒకే ఇంట్లో ఆరు తరాలు..83మంది సభ్యులు

ఇది కదా కుటుంబం అంటే..! ఒకే ఇంట్లో ఆరు తరాలు..83మంది సభ్యులు
Reading Time: 2 minutes

ఇది కదా కుటుంబం అంటే..! ఒకే ఇంట్లో ఆరు తరాలు..83మంది సభ్యులు

Caption of Image.

భార్య, భర్త, ముగ్గురు పిల్లలున్న  కుటుంబంలోనే తలో దిక్కు వెళ్తున్న రోజులు ఇవి. భర్త ఓ దగ్గర, భార్య ఇంకో దగ్గర.. పిల్లలు మరోదగ్గర.. కుటుంబంగా కలిసి భోంచేసిన సందర్భాలు చాలా తక్కువే ఉంటాయి. అలాంటి ఈ రోజుల్లో 83 మంది ఒకే ఇంట్లో ఉంటూ.. కలిసి భోంచేస్తూ.. బాధ్యతలు, బరువులు, సంతోషం, దుఖం కలిసి పంచుకుంటోంది  ఓ కుటుంబం. వలసలు, ఉపాధి, విద్య వంటివి తరచూ కుటుంబ సభ్యులను వేర్వేరు నగరాలు,  వేర్వేరు దేశాల్లో స్థిరపడేలా చేస్తున్న ఈ కాలంలో, ఆ కుటుంబ కథ స్పెషల్ గా నిలుస్తోంది. ఏపీకి చెందిన నాగప్ప కుటుంబం.. 83 మంది కుటుంబ సభ్యులతో పెద్ద ఉమ్మడి కుటుంబం కలిసి జీవించే సాంప్రదాయన్ని  కొనసాగిస్తోంది. అనంతపురం జిల్లాలోని కుర్లపల్లి గ్రామానికి చెందిన నాగప్ప కుటుంబంలో ఆరు తరాలకు చెందిన 83 మంది సభ్యులు ఉన్నారు. ఇది మోడరన్ భారతదేశంలో ఒక పెద్ద ఉమ్మడి కుటుంబానికి అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. నాగప్ప కుటుంబ సభ్యులు తమ జీవితాల గురించి, వారి మధ్య ఉన్న బంధం గురించి పీటీఐ X లో ఓ వీడియోలోను షేర్ చేసింది. నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. 

‘‘కుటుంబాలు కుచించుకుపోతున్న ఈ కాలంలో, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కుర్లపల్లి గ్రామంలోని నాగప్ప కుటుంబం ఐకమత్యానికి ఒక అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది… ఆరు తరాలకు చెందిన 83 మంది సభ్యులు, ఒకే ఇంట్లో ఉమ్మడి కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు. పక్కపక్కనే ఉన్న నాలుగు ఇళ్లలో వీరంతా ఉంటున్నారు. ఈ కుటుంబం భోజనం, ఆదాయం ,బాధ్యతలను షేర్ చేసుకుంటూ ఒకే కుటుంబంగా పనిచేస్తుంది.” అని క్యాప్షన్ ఇచ్చింది పీటీఐ. 

చాలామందికి 83 మంది సభ్యులున్న అంతపెద్ద కుటుంబంలో సమస్యలు రావా.. తిండి, బట్టలు, సంపాదన ఎలా మెయింటెన్ చేస్తున్నారు అనే సందేహాలు రావొచ్చు. 
పక్కా ప్రణాళిక, పరస్పర అవగాహన, ఎంతో సహనం ఉండాలి. వీటన్నింటిని మెయింటెన్ చేస్తూ..ఐక్యత,  ఎమోషనల్ సపోర్ట్, కలిసి బాధ్యతలు పంచుకుంటూ, పెద్దల పట్ల గౌరవం వంటి ఉమ్మడి కుటుంబాల సాంప్రదాయాన్ని పాటిస్తూ జీవిస్తున్నట్లు వారి మాటల్లోనే తెలుస్తుంది. ఏది ఏమైనా  భారతీయ సాంప్రదాయంలో ఉమ్మడి కుటుంబం ఓ ప్రత్యేకత.. అలాంటి సాంప్రదాయాన్ని  ఆచరిస్తున్న నాగప్ప కుటుంబానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. 

©️ VIL Media Pvt Ltd.