July 11, 2026

కేసీఆర్ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం ఖేల్ ఖతం.. మేడిగడ్డ, అన్నారంలో నీళ్లు నింపడం అసాధ్యం.. రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ప్రభుత్వంపై దుష్ప్రచారం

కేసీఆర్ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం ఖేల్ ఖతం.. మేడిగడ్డ, అన్నారంలో నీళ్లు నింపడం అసాధ్యం.. రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ప్రభుత్వంపై దుష్ప్రచారం
Reading Time: < 1 minute

కేసీఆర్ నిర్లక్ష్యంతోనే కాళేశ్వరం ఖేల్ ఖతం.. మేడిగడ్డ, అన్నారంలో నీళ్లు నింపడం అసాధ్యం.. రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ప్రభుత్వంపై దుష్ప్రచారం

Caption of Image.

గోదావరి జలాలు, కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్ఎస్, బీజేపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాల వెనుక ఉన్న అసలు నిజాలను బట్టబయలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. కొందరు రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో ప్రభుత్వంపై పొలిటికల్ కుట్రలు చేస్తున్నారని… వాస్తవాలను ప్రజల ముందుంచడానికే తాను ఈ ప్రెస్ మీట్ పెట్టానని స్పష్టం చేశారు. కాళేశ్వరంపై బీఆర్ఎస్ కిలాడీ కమిటీలు చెప్పే సొల్లు కబుర్లను తాము పట్టించుకోబోమని తేల్చిచెప్పారు.

కాళేశ్వరం ప్రారంభించిన ఏడాదిలోనే అందులో తీవ్ర లోపాలు ఉన్నాయని అప్పటి ఈఈ రమణారెడ్డి లేఖ రాసినా… నాటి కేసీఆర్ ప్రభుత్వం ఆ సూచనలను తుంగలో తొక్కిందని సీఎం ఆరోపించారు. కేసీఆర్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయే పరిస్థితి వచ్చిందని… ఆయన నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఎన్డీఎస్ఏ (NDSA) నివేదిక కూడా స్పష్టం చేసిందని గుర్తు చేశారు. 2022 జూలై వరదల్లో కన్నెపల్లి పంప్ హౌజ్ మునిగిపోతే… దానికి సరైన రిపేర్లు చేయకపోవడం వల్లే అది ఇప్పటికీ వినియోగంలోకి రాలేదన్నారు.

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల… ఈ మూడు బ్యారేజీలు దెబ్బతిన్నాయని, వీటిలో నీటిని నిల్వ చేయడం కానీ, నీళ్లను మళ్లించడం కానీ ప్రస్తుతానికి సాధ్యం కాదని నిపుణులు ,ఎన్డీఎస్ఏ తేల్చి చెప్పినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఈ మూడు బ్యారేజీలను సమగ్రంగా పునరుద్ధరించాల్సి ఉందన్న సీఎం… ఎన్డీఎస్ఏ, సీడబ్ల్యూసీ (CWC) ఆమోదంతో, వారి సూచనల మేరకే తమ ప్రభుత్వం బ్యారేజీల పునరుద్ధరణ పనులు చేపడుతుందని స్పష్టం చేశారు.

©️ VIL Media Pvt Ltd.