ఏంటి? పవన్ సినిమాలో ఛాన్స్ వస్తే వదులుకుందా?

నాగదుర్గ.. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమె పేరు తెగ వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఈ ఫోక్ సింగర్ పేరు తెగ మార్మోగుతోంది. ఇప్పటివరకు తన ఫోక్ సాంగ్స్, డ్యాన్సులతో యూట్యూబ్ ను షేక్ చేసిన నాగ దుర్గ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైనా మెరవనుంది. ఇప్పటికే తెలుగులో ‘కలివి వనం’ అనే సినిమాలో నటించింది.. అలాగే తమిళంలో ధనుష్ మేనల్లుడి సరసన ‘లవ్ ఓ లవ్’ అనే సినిమా చేస్తోంది.. బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ఇడుపు కాయితం సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది నాగ దుర్గ. ఈ క్రమంలోనే రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన నాగ దుర్గ.. గతంలో తనకు పవన్ సినిమాలో ఛాన్స్ వచ్చినా రిజెస్ట్ చేశానంటూ చెప్పి అందర్నీ షాకయ్యేలా చేసింది. నాగదుర్గకు గతంలోనే పలు సినిమా ఛాన్స్ లు వచ్చాయి. అయితే వివిధ కారణాలతో వాటిని రిజెక్ట్ చేసింది. నాని హీరోగా నటించిన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమాలో సాయి పల్లవి పాత్రకు సహచరిగా క్లాసికల్ టచ్ ఉన్న ఓ ముఖ్యమైన పాత్ర కోసం నాగ దుర్గను అడిగారు. అలాగే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలో కూడా నాగ దుర్గకు ఛాన్స్ వచ్చింది. ఈ రెండింటితో పాటే.. పవన్ కల్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ‘బ్రో’ సినిమాలో సిస్టర్ క్యారెక్టర్ కోసం కూడా మేకర్స్ నాగదుర్గను సంప్రదించారట. వీటితో పాటే పలు టీవీ సీరియల్స్‌లో కూడా లీడ్ రోల్లో నటించే అవకాశం వచ్చినప్పటికీ… తాను రిజెక్ట్ చేసినట్టు నాగదుర్గ తన రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తన ఫోకస్ పూర్తిగా నాట్యంపైనే ఉండేదని… కూచిపూడి నృత్యంలో డాక్టరేట్ సాధించాలన్నది తన కల అని.. అందుకే సినిమాల్లోకి వెంటనే రావాలని అనుకోలేదంటూ నాగ దుర్గ చెప్పుకొచ్చింది. నాట్యానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలనే ఉద్దేశంతో వచ్చిన ఈ సినిమా ఆఫర్లను వదులుకోవాల్సి వచ్చిందంటూ క్లారిటీ ఇచ్చింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
V. V. Vinayak: ఆ సినిమా చేసి తప్పు చేశా.. వినాయక్ భావోద్వేగం
Naga Durga: బిగ్ బాస్ బంపర్ ఆఫర్.. కానీ.. ఇడుపు కాయితం ఫేమ్ నాగ దుర్గ షాకింగ్ రీజన్
Naga Vamsi: బుక్‌మైషో బండారం బయటపెట్టిన నాగ వంశీ..
బిగ్ స్క్రీన్ మీద బిగ్ చేంజ్… ఆడియన్స్ టేస్ట్ మారుతోందా..?