Jananayagan : విజయ్ లాస్ట్ మూవీతో కిరణ్‌కు తిప్పలు

మొత్తానికి ‘జననాయగన్’కు సెన్సార్ నుంచి మోక్షం దక్కింది. 12 కట్స్‌తో ‘ఏ’ సర్టిఫికెట్ ఇచ్చి రిలీజ్‌కి దారి చూపించింది. సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ నెల 24న విడుదలకు సన్నాహాలు చేస్తున్నారట. అయితే అదే రోజు వస్తున్న కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’కి దెబ్బ తగిలింది. కిరణ్ అబ్బవరం, గౌరి ప్రియ జంటగా నటించిన సినిమా ‘చెన్నై లవ్ స్టోరీ’ 24న విడుదలవుతుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు సినిమాకు హైప్ తీసుకొచ్చాయి. హీరోయిన్‌కు తమిళంలో మంచి క్రేజ్ ఉండడంతో తమిళంలో కూడా రిలీజ్ చేస్తున్నారు.
అదే రోజు ‘జననాయగన్’ వస్తుందన్న ప్రచారం ‘చెన్నై లవ్ స్టోరీ’కి షాక్ ఇచ్చింది. ‘జననాయగన్’ పోటీ ఇవ్వడంతో ‘చెన్నై లవ్ స్టోరీ’ రిలీజ్ డేట్ మార్చుకుంటుందా అన్న డౌట్ వస్తుంది. కిరణ్ అబ్బవరంకు తమిళంలో మార్కెట్ లేదు. తెలుగు మార్కెట్టే ముఖ్యం కావడంతో ‘జననాయగన్’ అసలు పోటీనే కాదు. విజయ్ ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది. ‘జననాయకుడు’ పేరుతో ‘జననాయగన్’ తెలుగులో రిలీజ్ అవుతుంది. తమిళనాడు సీఎం అయ్యాక విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో క్రేజ్ బాగా పెరిగింది. నటుడిగా ఇది ఆయనకు చివరి సినిమా కూడా కావడంతో భారీ హైప్‌తో రిలీజ్ అవుతుంది.
తెలుగులో హిట్ అయిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్‌గా ‘జననాయగన్’ రూపొందింది. ఆల్రెడీ చూసిన సినిమానే తెలుగు ప్రేక్షకులు మళ్లీ చూస్తారా? అందులోనూ బాలయ్య పోషించిన రోల్‌తో విజయ్ మెప్పించడం కష్టమే అయినా, ఎలా చేశాడా అని చూసే ఫ్యాన్స్ ఉన్నారు. ఈ లెక్కన ‘భగవంత్ కేసరి’తో సంబంధం లేకుండా చూస్తారా వంటి క్వశ్చన్స్ ‘చెన్నై లవ్ స్టోరీ’ మేకర్స్‌ను ఇబ్బంది పెడుతున్నాయి.