July 11, 2026

బహమాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం కూలి 10 మంది దుర్మరణం

బహమాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం కూలి 10 మంది దుర్మరణం
Reading Time: < 1 minute

బహమాస్‌లో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం కూలి 10 మంది దుర్మరణం

Caption of Image.

ఉత్తర అమెరికాలోనిబహమాస్‌ దీవుల్లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. నసావులోని లిండెన్ పిండ్లింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టునుంచి శాన్ ఆండ్రోస్‌కు బయలుదేరిన ఫ్లెమింగో ఎయిర్‌కు చెందిన సెస్నా-402 చిన్న విమానం నార్త్ ఆండ్రోస్ సమీపంలో కూలిపోయింది. ఈ ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనపై బహామియన్ విమాన ప్రమాద దర్యాప్తు సంస్థ విచారణ ప్రారంభించింది. 

ALSO READ : E20 పెట్రోల్‌‌పై 9 అనుమానాలు ఇవే..

ముందుజాగ్రత్త చర్యగా ఫ్లెమింగో ఎయిర్ ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేట్‌ను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఇదే రోజు ఆ సంస్థకు చెందిన మరో విమానంలో సాంకేతిక లోపం తలెత్తి, అత్యవసరంగా నస్సావుకు తిరిగొచ్చిన తర్వాత మంటలు చెలరేగిన ఘటన కూడా చోటుచేసుకుంది.

©️ VIL Media Pvt Ltd.