July 12, 2026

సినర్ కాదు.. జకో కాదు.. తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ ఎవరో బయటపెట్టిన గిల్

సినర్ కాదు.. జకో కాదు.. తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ ఎవరో బయటపెట్టిన గిల్
Reading Time: < 1 minute

సినర్ కాదు.. జకో కాదు.. తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ ఎవరో బయటపెట్టిన గిల్

Caption of Image.

బ్రిటన్: టీమిండియా టెస్ట్, వన్డే కెప్టెన్ శుభమన్ గిల్ తన ఆల్ టైమ్ ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ ఎవరో రివీల్ చేశాడు. ప్రపంచ టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ తన అభిమాన టెన్నిస్ ఆటగాడని వెల్లడించాడు. శనివారం (జులై 11) స్టార్ ప్లేయర్స్ జానిక్ సినర్, జకోవిచ్ మధ్య జరిగిన వింబుల్డన్ మెన్స్ సింగల్స్ సెమీ ఫైనల్ మ్యాచ్‎కు గిల్ హాజరయ్యాడు. 

ఈ సందర్భంగా జియోహాట్‌స్టార్‌తో భారత కెప్టెన్ మాట్లాడుతూ.. ‘‘రోజర్ ఫెదరర్ నాకు అత్యంత ఇష్టమైన టెన్నిస్ ప్లేయర్. ఆయన సొగసైన ఆటకు నేను పెద్ద ఫ్యాన్. ఆయన చాలా హుందాగా వ్యవహరిస్తారు. అందుకే అతన్ని ఆరాధిస్తాను’’ అని తెలిపాడు. ఫెదరర్ ఏదైనా చాలా సింపుల్‎గా చేసేస్తాడని నా చిన్నతనం నుంచి వింటున్నా.. కానీ అలా అనిపించుకోవడానికి ఎంత కృషి అవసరమో ఒక ఆటగాడికి మాత్రమే తెలుసన్నాడు. క్రికెట్‌లో నన్ను కూడా సునాయాసంగా ఆడతానని అంటారు. కానీ దాని వెనుక ఉన్న కష్టం, కృషి నాకు మాత్రమే తెలుసని పేర్కొన్నాడు. 

టైటిల్ ఫేవరెట్ జానిక్ సినర్

ఇక, వింబుల్డన్‎ 2026లో తాను జానిక్ సినర్‎కు మద్దతు ఇస్తున్నట్లు గిల్ తెలిపాడు. సినర్ టైటిల్ విజేతగా నిలవాలని కోరుకుంటున్నానని చెప్పాడు. సినర్ అద్భుతమైన ఆటగాడని.. అతను కోర్టు లోపల, బయట చాలా చక్కగా ప్రవర్తిస్తాడని కొనియాడాడు. 

ఫైనల్‎కు సినర్

వింబుల్డన్ 2026 మెన్స్ సింగల్స్ విభాగంలో ఇటలీ స్టార్ జానిక్ సినర్ ఫైనల్‎కు చేరాడు. సెమీ ఫైనల్‎లో సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్‎ను వరుస రౌండ్లలో సినర్ మట్టికరిపించి ఫైనల్‎కు దూసుకెళ్లాడు. టైటిల్ ఫైట్‎లో జర్మనీకి చెందిన జ్వెరెవ్‌తో తలపడనున్నాడు. 2026, జూలై 12న ఈ బ్లాక్ బస్టర్ పోరు జరగనుంది. 

 

©️ VIL Media Pvt Ltd.