Reading Time: < 1 minute
Vietnam Boat Accident Telangana Control Room

వియత్నాంలోని ఫు క్వాక్ ఐలాండ్ (Phu Quoc Island) సమీపంలో భారతీయ పర్యాటకులతో వెళ్తున్న ఒక పర్యాటక బోటు ప్రమాదవశాత్తూ మునిగిపోయింది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన పర్యాటకులు కూడా ఉన్నట్లు సమాచారం అందడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ప్రమాదానికి గురైన బాధితుల కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారాన్ని అందించడానికి, అలాగే సహాయక చర్యలను వేగంగా సమన్వయం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ జనరల్ అడ్మినిస్ట్రేషన్ (NRI) విభాగం శనివారం ఒక ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది.

 

బాధితుల కుటుంబీకులు సమాచారం తెలుసుకోవడం కోసం ప్రభుత్వం నాలుగు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తెచ్చింది. బాధితులకు సంబంధించిన వివరాల కోసం 9885371189, 7997959754, 9989654807, 7997959779 నంబర్లలో సంప్రదించవచ్చని అధికారిక ప్రకటనలో స్పష్టం చేశారు. వియత్నాంలోని భారత రాయబార కార్యాలయంతో పాటు స్థానిక అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సంప్రదింపులు జరుపుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తోంది.