Reading Time: < 1 minute

ఎంపీ పుట్టా మహేష్ పై టీడీపీ అధిష్టానం సీరియస్… 

Caption of Image.

మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేసులో అరెస్టైన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై టీడీపీ అధిష్టానం సీరియస్ అయ్యింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వాలని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు ఆదేశాలు జారీ చేశారు చంద్రబాబు. డ్రగ్స్ కేసులో మహేష్ పట్టుబడ్డ అంశంపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు చంద్రబాబు. డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.

వ్యక్తులు , నేతల బలహీనతలు, తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనని పేర్కొన్నారు చంద్రబాబు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలని, ఈ అంశంపై సమగ్ర నివేదిక వచ్చే వరకు పుట్టా మహేష్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది టీడీపీ అధిష్టానం.

►ALSO READ | తెలంగాణ ప్రజల తరపున విజ్ఞప్తి చేస్తున్నా.. ఈ సారైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలి: మంత్రి కోమటిరెడ్డి

తనపై వచ్చిన ఆరోపణలకు ఐదు రోజుల్లో లిఖితపూర్వక వివరణను పార్టీకి అందించాలని సూచించింది. మహేష్ వివరణ ఆధారంగా పార్టీ అధిష్టానం జరిగిన ఘటనపై అవసరమైన చర్యలు తీసుకుంటుందని పేర్కొంది పార్టీ అధిష్టానం.

©️ VIL Media Pvt Ltd.