Reading Time: < 1 minute

జ్వరంతో ఆసుపత్రికి వచ్చిన యువతితో అనుచిత ప్రవర్తన… డాక్టర్ ను పొట్టు పొట్టు కొట్టిన్రు..

Caption of Image.

మహబూబాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. జిల్లాలోని తొర్రూరు పట్టణంలో చికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లిన యువతితో అనుచితంగా ప్రవర్తించిన డాక్టర్ పై దాడి చేశారు ఆమె కుటుంబసభ్యులు. ఆదివారం ( మార్చి 15 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తొర్రూరు పట్టణంలో డాక్టర్ కిరణ్ కుమార్ విజయలక్ష్మి హాస్పిటల్ నిర్వహిస్తున్నారు. హాస్పిటల్ కు జ్వరంతో బాధపడుతూ చికిత్స కోసం వచ్చింది ఓ యువతి.

చికిత్స కోసం వచ్చిన యువతితో అనుచితంగా ప్రవర్తించాడు కిరణ్ కుమార్. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబసభ్యులు ఆసుపత్రి దగ్గరికి చేరుకొని డాక్టర్ పై దాడి చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు.

►ALSO READ | ఖమ్మం జిల్లాలో దారుణం: HM మందలించిందని.. ఆశ్రమ పాఠశాల విద్యార్థిని ఆత్మహత్య..

చికిత్స కోసం వచ్చిన పేషెంట్స్ పట్ల అనుచితంగా ప్రవర్తించే ఇలాంటి డాక్టర్లు వైద్య వృత్తికే మాయని మచ్చ అని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు బాధితురాలి కుటుంబసభ్యులు.

©️ VIL Media Pvt Ltd.