Reading Time: 2 minutes

5000 మీటర్ల ట్రాక్‌పై భారత్కి తొలిసారి మెడల్.. గుల్వీర్ సింగ్ సూపర్ షో 

Caption of Image.

Gulveer Singh: గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్ 2026 (Commonwealth Games 2026) అథ్లెటిక్స్ పోటీల్లో భారత స్టార్ లాంగ్ డిస్టెన్స్ రన్నర్ గుల్వీర్ సింగ్ (Gulveer Singh) సరికొత్త చరిత్ర సృష్టించారు. పురుషుల 5000 మీటర్ల విభాగంలో కాంస్య పతకం (Bronze Medal) సాధించి, కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలోనే ఈ విభాగంలో పతకం గెలిచిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచారు. ఇప్పటికే పురుషుల 10,000 మీటర్ల పరుగు పందెంలో రజత పతకం (Silver Medal) గెలుచుకున్న గుల్వీర్, ఒకే కామన్వెల్త్ గేమ్స్ ఎడిషన్‌లో అథ్లెటిక్స్‌లో రెండు పతకాలు సాధించిన ఏకైక భారతీయ క్రీడాకారుడిగా ఘనత వహించారు.  

గుల్వీర్ సింగ్ చారిత్రక ఘనతలు:

కామన్వెల్త్ గేమ్స్ సుదీర్ఘ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో రెండు సుదీర్ఘ రేసులలో (5,000m & 10,000m) పతకాలు సాధించిన తొలి భారతీయుడు. ఇప్పటివరకు ఆఫ్రికా, పాశ్చాత్య దేశాల ఆధిపత్యం ఉన్న రన్నింగ్ విభాగాల్లో భారత్‌కు తిరుగులేని గుర్తింపు తెచ్చారు. ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ (అత్రోలి) గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి, భారత సైన్యంలో (గ్రెనేడియర్స్ రెజిమెంట్) చేరి అథ్లెటిక్స్‌లో దేశానికి అత్యున్నత శిఖరాలను అందించారు. దేశం కోసం పతకాలు సాధించడమే నా ప్రధాన లక్ష్యం.. సరైన వ్యూహంతో రేసు ముగించడం సంతోషంగా ఉందని గుల్వీర్ పేర్కొన్నారు.   

5000m రేసు ఫలితాలు:

తీవ్రమైన పోటీ నెలకొన్న ఈ రేసులో చివరి ల్యాప్‌లో అద్భుతమైన స్ ప్రింట్‌తో పుంజుకున్న గుల్వీర్ కేన్యా రన్నర్‌ను కేవలం 0.04 సెకన్ల స్వల్ప తేడాతో వెనక్కి నెట్టి మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 

     స్థానం                                   అథ్లెట్                                                    దేశం                                     ముగింపు సమయం
* స్వర్ణం (Gold)                  మాథ్యూ కిప్‌చుంబా కిప్‌సాంగ్                        కెన్యా                                           13:23.61

* రజతం (Silver)                  కై రాబిన్సన్                                                   ఆస్ట్రేలియా                                13:24.70

* కాంస్యం (Bronze)              గుల్వీర్ సింగ్                                                  భారత్                                        13:24.95

 

 

©️ VIL Media Pvt Ltd.