Reading Time: < 1 minute

అయోధ్య విరాళాల చోరీపై గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నిరసన

Caption of Image.
  • నాటకాన్ని ప్రదర్శించిన కాంగ్రెస్ శ్రేణులు 

హైదరాబాద్, వెలుగు: అయోధ్య రామాలయ విరాళాల చోరీ ఘటనను నిరసిస్తూ శనివారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని గాంధీ భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ నేతలు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ఫిషరీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మెట్టు సాయి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భక్తులు రాముడికి సమర్పించిన కానుకలు, విరాళాలు ఏ విధంగా దుర్వినియోగానికి గురయ్యాయో తెలియజేస్తూ కాంగ్రెస్ శ్రేణులు ప్రదర్శించిన నాటకం అందరినీ ఆకట్టుకుంది.

ఈ ప్రదర్శనను నాయకులు, ప్రజలు ఆసక్తిగా తిలకించారు. అనంతరం మెట్టు సాయి మీడియాతో మాట్లాడుతూ…రాముడి పేరు మీద బీజేపీ ఓట్లు అడగడమే కాదు, చివరకు ఆయన విరాళాలను సైతం  దోచుకున్నదని ఆరోపించారు. ప్రజల భక్తిని ఆసరా చేసుకొని మోదీ సర్కార్ నాటకం ఆడుతోందని మండిపడ్డారు

 

©️ VIL Media Pvt Ltd.