
- మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో వ్యవసాయ శాఖ వినూత్న ప్రచారం
- సిబ్బందితో కలిసి గ్రామంలో ర్యాలీ
- పంట మార్పిడితో జరిగే మేలు, అధిక యూరియా వినియోగంతో జరిగే నష్టాలపై రైతులకు అవగాహన
మహబూబాబాద్, వెలుగు మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలంలో శనివారం ఆరుతడి పంటల సాగుపై మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వినూత్న ప్రచారం నిర్వహించారు. సిబ్బందితో కలిసి గ్రామంలో డప్పుచప్పుళ్లతో అవగాహన ర్యాలీ తీశారు. డప్పు కొట్టుకుంటూ.. జానపద కళారూపాలు, పాటల ద్వారా పంట మార్పిడితో జరిగే మేలు, అధిక యూరియా విని యోగంతో భూసారానికి కలిగే నష్టాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఏవో రాజు మాట్లాడుతూ పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం చే పట్టామని చెప్పారు. రైతులతో కలిసి గ్రామంలో, పంట చేలల్లో ర్యాలీ నిర్వహించడం ద్వారా మార్పు తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఒకే పంటను సాగు చేయడం వల్ల నేల సారం తగ్గిపో తుందని, వరి, మొక్కజొన్న పంటల్లో అధికంగా యూరియా వినియోగించడం వల్ల భూసారం దెబ్బతినడంతో పాటు సాగు ఖర్చులు పెరిగే అవకాశం ఉందన్నారు. పంట మార్పిడితో పాటు అవసరం మేరకే ఎరువులు వినియోగించాలని సూచించారు.