
సంగీత దర్శకుడిగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు నటుడిగా మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన పుట్టినరోజు (ఆగస్టు 2) సందర్భంగా నటిస్తున్న ‘ఎల్లమ్మ’ సినిమా నుంచి మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇందులో దేవిశ్రీ ప్రసాద్ ‘పర్షి’ (Parshi) అనే గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు.
The birth of an actor…
On the day of his birth ❤️🔥A name called PARSHI.
A world called #Yellamma.
A journey we are all waiting to witness 🔥#HBDDeviSriPrasad #SVC61 Rockstar @thisisdsp @VenuYeldandi9 #DilRaju #Shirish @muraligdop @Hr_3555 #HanshithaReddy @svc_official… pic.twitter.com/9yo6QzBN8X— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026
పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ పూర్తి డీ-గ్లామర్ లుక్‌లో ఆకట్టుకున్నారు. పల్లెటూరి యువకుడి గెటప్, సహజమైన హావభావాలతో ఆయన లుక్ ఆసక్తిని పెంచుతోంది. ఈ ఒక్క పోస్టర్‌తోనే సినిమాలో ఆయన పాత్ర ఎంత భిన్నంగా ఉండబోతోందో దర్శకుడు వేణు ఎల్దండి హింట్ ఇచ్చారు.
►ALSO READ | Pooja Hegde: హీరోయిన్ పూజా హెగ్డే పెళ్లి వార్తలు.. వరుడు అతనేనా? కొనసాగుతున్న సస్పెన్స్!
‘బలగం’ సినిమాతో గ్రామీణ నేపథ్యంలో హృదయాలను హత్తుకునే కథను అందించిన దర్శకుడు వేణు ఎల్దండి.. ఇప్పుడు తన రెండో చిత్రంగా ‘ఎల్లమ్మ’ను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమాపై భారీ అంచనాలు పెంచగా, తాజాగా విడుదలైన దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ లుక్ ఆ అంచనాలను మరింత పెంచేసింది.
ఈ పోస్టర్‌ను విడుదల చేసిన నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్స్ సోషల్ మీడియాలో ఆసక్తికర క్యాప్షన్‌ను షేర్ చేసింది. ‘‘మనం ఇప్పటివరకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సెలబ్రేట్ చేశాం.. ఇక వెండితెరపై నటుడిగా ఆయనను కూడా సెలబ్రేట్ చేద్దాం. హ్యాపీ బర్త్‌డే రాక్‌స్టార్ డీఎస్పీ.. రాబోయేది చూసేందుకు ప్రపంచం ఇంకా సిద్ధంగా లేదు’’ అంటూ ట్వీట్ చేసింది. సంగీత దర్శకుడిగా ఎన్నో విజయాలు అందుకున్న దేవిశ్రీ ప్రసాద్.. ఇప్పుడు నటుడిగా ‘పర్షి’ పాత్రతో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
#Yellamma… and in it a man called PARSHI ❤️🔥
Presenting the ACTOR @ThisIsDSP in a role rooted in the soil with a name you will remember and a journey you will never forget 🔥
We always celebrate his music… Along with that, let’s celebrate him on the silver screen too 😍… pic.twitter.com/zLsdRarC5G
— Sri Venkateswara Creations (@SVC_official) August 2, 2026
ఇంతకీ ‘పర్షి’ కథేంటి?
పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ సాధారణ ‘పర్షి’ అనే ఒక పల్లెటూరి యువకుడిగా ఉండే అవకాశం కనిపిస్తోంది. అందుకు తగ్గట్టుగా చారల చొక్కా, పంచె/స్లిప్పర్లు తరహా లుక్‌లో కనిపిస్తున్నారు. ఇక పర్షి చేతిలో ఉన్న ఎల్లమ్మ అమ్మవారి అలంకరించిన ముఖవిగ్రహం బట్టి, గ్రామ జాతరలు, బోనాలు లేదా ఎల్లమ్మ ఉత్సవాలతో పాత్రకు బలమైన అనుబంధం ఉండొచ్చని తెలుస్తోంది.
అయితే, ఈ విగ్రహాన్ని మోస్తున్న తీరు చూస్తే, పర్షి గ్రామోత్సవాల్లో పాల్గొనే వ్యక్తి, కళాకారుడు లేదా సంప్రదాయాన్ని కాపాడే యువకుడు అయ్యి ఉండొచ్చుని తెలుస్తోంది. ఇక పోస్టర్‌లో దేవిశ్రీ ప్రసాద్ ముఖంలో అమాయకత్వం, ఆత్మవిశ్వాసం రెండూ కనిపిస్తున్నాయి. దీంతో కథలో సాధారణ వ్యక్తిగా మొదలై, తర్వాత కీలకమైన మలుపుకు కారణమయ్యే పాత్రగా ఉండే అవకాశం ఉంది.
ఇలా మొత్తానికి దర్శకుడు వేణు ఎల్దండి తెరకెక్కించిన బలగం తరహాలోనే, ఈ సినిమాలో కూడా గ్రామీణ బంధాలు, సంప్రదాయాలు, మానవ సంబంధాల చుట్టూ పర్షి పాత్ర ప్రయాణం ఉండొచ్చని పోస్టర్ బట్టి అర్ధం అవుతుంది.