
- జులై 27న ఇచ్చిన ఉత్తర్వుల్లోని అపెండిక్స్ – డి అఫిడవిట్ సవరణ
హైదరాబాద్, వెలుగు: ఎంబీబీఎస్ కోర్సు ప్రవేశాల్లో దివ్యాంగుల అసెస్‌మెంట్ గైడ్‌లైన్స్‌లో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కీలక మార్పులు చేసింది. గతంలో జులై 27న జారీ చేసిన పబ్లిక్ నోటీసును పాక్షికంగా సవరిస్తూ శనివారం ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు లోకోమోటర్ డిజెబిలిటీకి చెందిన ‘అపెండిక్స్ -డి’ అఫిడవిట్‌ను మార్చినట్లు ఎన్‌ఎంసీ కార్యదర్శి డాక్టర్ రాఘవ్ లంగర్ వెల్లడించారు. సవరించిన అఫిడవిట్‌లో అభ్యర్థులు తమంతట తాము నిలబడటం, నడవడం, కూర్చోవడం వంటి శారీరక సామర్థ్యాలు కలిగి ఉన్నారో.. లేదో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, జులై 27న విడుదల చేసిన గైడ్‌లైన్సెస్‌లోని మిగతా అన్ని నిబంధనలు, షరతుల్లో ఎలాంటి మార్పు లేకుండా యథావిధిగా అమలవుతాయని పేర్కొన్నారు.