Reading Time: 2 minutes
Cwg 2026 Medals Table India Wins 16 Medals In A Day Climbs To 4th Place

CWG 2026 Medals: కామన్వెల్త్ గేమ్స్ 2026 ముగిస్తున్న వేళ.. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో అడగొడుతున్నారు. ఈ మెగా టోర్నీ 10వ రోజు (ఆగస్టు 1) భారత అథ్లెట్లు ఏకంగా 16 పతకాలు సాధించి దేశ సత్తా చాటారు. శనివారం నాడు (ఆగస్టు 1) ఏకంగా 8 స్వర్ణాలు, 5 రజతాలు, 3 కాంస్య పతకాలు సాధించడంతో భారత్ కు గోల్డెన్ డే గా మారింది. ఈ విజయాలతో CWC 2026 పతకాల పట్టికలో భారత్ ఒకేసారి ఆరు స్థానాలు ఎగబాకి 10వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరుకుంది.

ఒక్క రోజులోనే 16 పతకాలు:

10వ రోజు ఆటల ప్రారంభానికి ముందు భారత్ ఖాతాలో 5 స్వర్ణాలు, 12 రజతాలు, 6 కాంస్యాలు కలిపి మొత్తం 23 పతకాలు మాత్రమే ఉన్నాయి. అయితే శనివారం భారత క్రీడాకారులు అద్భుతం సృష్టించారు. ఒక్కరోజే మరో 16 పతకాలు అందించడంతో.. భారత్ మొత్తం 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు కలిపి 39 పతకాలతో నాలుగో స్థానానికి చేరుకుంది.

భారత బాక్సర్ల పంచ్‌:

భారత్ విజయాల్లో బాక్సర్లు కీలక పాత్ర పోషించారు. వివిధ కేటగిరీలలో 10 మంది భారత బాక్సర్లు ఫైనల్స్‌కు చేరుకోగా.. వారిలో 7 మంది స్వర్ణ పతకాలు, మిగిలిన ముగ్గురు ఫైనల్లో ఓడి రజత పతకాలు అందుకొని సరికొత్త చరిత్ర సృష్టించారు. కామన్వెల్త్ గేమ్స్ చరిత్రలో భారత బాక్సర్లు ఒకే ఎడిషన్‌లో 7 స్వర్ణాలు గెలవడం ఇదే మొదటిసారి.

Image (5)

రజత, కాంస్య పతకాలలోనూ..

భారత్ 10వ రోజు మొత్తం 5 రజత పతకాలు గెలుచుకుంది. వీటిలో మూడు బాక్సింగ్‌లో మహిళల 75 కేజీలు, పురుషుల 90 కేజీలు, పురుషుల 55 కేజీల విభాగాల్లో వచ్చాయి. మిగిలిన రెండు రజతాలు పురుషుల ట్రిపుల్ జంప్, పురుషుల షాట్‌పుట్ F57 విభాగాల్లో లభించాయి. అలాగే భారత్ 3 కాంస్య పతకాలు కూడా సాధించింది. వీటిలో పురుషుల ట్రిపుల్ జంప్, 5000 మీటర్ల పరుగు, జూడో విభాగాల్లో ఒక్కో పతకం దక్కింది.

పారా అథ్లెటిక్స్‌లోనూ..

బాక్సింగ్‌తో పాటు పారా అథ్లెటిక్స్‌లో కూడా భారత్‌కు స్వర్ణ పతకం దక్కింది. పురుషుల షాట్‌పుట్ F57 విభాగంలో సోమన్ రాణా అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని కైవసం చేసుకుని దేశానికి మరో గోల్డ్ అందించాడు.

చివరి రోజు కూడా ఇదే జోరు కొనసాగిస్తే పతకాల సంఖ్యను మరింత పెంచే అవకాశం ఉంది. 2010 ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ 101 పతకాలతో (38 స్వర్ణాలు) రెండో స్థానంలో నిలిచింది.