
ఇంటర్నేషనల్ ఫ్రెండ్ షిప్ డే ను పురస్కరించుకుని సామాన్యులతో పాటు పలువురు సెలబ్రిటీలు తమ బెస్ట్ ఫ్రెండ్స్ కు విషెస్ చెబుతున్నారు. వారితో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులు పెడుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరని తెలుసుకునేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అల్లు అర్జున్ కు బాగా సన్నిహితులైన నలుగురు స్నేహితులు ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ ప్రొడ్యూసర్లుగా కొనసాగుతున్నారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది బన్నీవాస్ గురించి. అల్లు అర్జున్ బెస్ట్ ఫ్రెండ్స్ లో బన్నీ వాస్ ఒకరని చెప్పవచ్చు. అల్లు అర్జున్ సినిమా కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయన బన్నీ వెంట ఉన్నారు. మొన్నటివరకు అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన బన్నీ వాస్ ఇప్పుడు సొంతంగానే సినిమాలు చేసే స్థాయికి ఎదిగారు.
కాగా కొన్ని రోజుల క్రితం లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ సినిమాను అల్లు అర్జున్ అనౌన్స్ చేశారు. ‘AA23’ (వర్కింగ్ టైటిల్) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్‌తో పాటు, అల్లు అర్జున్ స్నేహితులు సహ నిర్మాతలుగా మారారు. బన్నీ స్కూల్ డేస్ ఫ్రెండ్స్ అయిన సందీప్ రామినేని, నటరాజ్ ఈ సినిమా కో- ప్రొడ్యూసర్లుగా ఉన్నారు. అలాగే అల్లు అర్జున్ కజిన్, చిన్ననాటి స్నేహితురాలు స్వాతి కూడా ఈ సినిమాలో భాగమయ్యారు. వీరే కాదు బన్నీ స్నేహితులైన ఎస్‌కెఎన్, శరత్‌లు కూడా ఇప్పటికే సక్సెస్‌ఫుల్ నిర్మాతలుగా రాణిస్తున్నారు.
ఇక సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ ప్రస్తుతం రాకా సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ అడ్వెంచెరస్ యాక్షన్ థ్రిల్లర్ లో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్చ్ సుమారు రూ.800 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లోనూ ఓ సినిమాకు కమిట్ అయ్యారు బన్నీ.
స్నేహితులో అల్లు అర్జున్..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.