Reading Time: 2 minutes

నాబిడ్డకు ఇది పునర్జన్మ..దత్తత తీసుకొని భవిష్యత్తుకు సాయం చేయండి : మోదీని తిట్టిన బాలికతల్లి విజ్ణప్తి

Caption of Image.

ఢిల్లీలోని  జంతర్ మంతర్ నిరసన క్రమంలో ప్రధాని మోదీని తిట్టిన బాలిక తల్లి ఆయనకు క్షమాపణ చెప్పారు. అభ్యంతరకరమైన మాటలు మాట్లాడినప్పటికీ ప్రధాని  మోదీని చర్యలు తీసుకోకుండా క్షమించారు. ఇది నా కూతురికి పునర్జర్మ అని అన్నారు. చేతులు జోడించి మనస్పూర్తిగా కృతజ్ణతలు తెలిపారు. 

ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ వీడియోలో బాలిక తల్లి మాట్లాడుతూ.. ప్రధానిమోదీకి నాదొక విన్నపం… ఆయన దేశానికిరాజు.. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినప్పటికీ చిన్నారిని క్షమించి ఆయ గొప్ప గుణం చాటుకున్నరారు. ఆయనకు నేను మనస్ఫూర్తిగా చేతులు జోడిండి కృతజ్ణతలు తెలుపుతున్నాను.. ఈ రోజు నా కూతురి పుట్టినరోజు, ప్రధానిమోదీ నుంచే వచ్చిన ఆమెకు లభించిన గొప్ప బహుమతి ఇది.. ఆమెకు ఆయన జీవదానం చేశారు. ఈ రోజు నా కూతురికి పునర్జన్మ లాంటిది అని  చెప్పారు. 

నా బిడ్డను దత్తత తీసుకోండి..

 
తన కుమార్తెను  దత్తత తీసుకుని ఆమె భవిష్యత్తును తీర్చిదిద్దాలని బాలిక తల్లి ప్రధానిని  అభ్యర్థించించారు.  గ్రామాలను దత్తత తీసుకుని, మెరుగైన భారతదేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నట్లే, దయచేసి నా బిడ్డను కూడా మీ మార్గదర్శకత్వంలోకి తీసుకుని, ఆమె జీవితాన్ని పునర్నిర్మించుకోవడంలో సాయం చేయాలని, ఆమెకు కూడా కుటుంబం ప్రేమ, మద్దతు అందేలా చూడండి అని ఆమె అన్నారు.మరోవైపు బాలికపై ఉన్న కేసులను ఎత్తివేయాలని ప్రధాని మోదీకి విజ్ణప్తి చేశారు ఆమె తల్లి. ఆమెపై నమోదు అయిన కేసులను ఎత్తివేసి  ఆమె ప్రశాంతంగా జీవించేలా చూడాలని కోరారు. 

ఢిల్లీ సంఘటన తర్వాత తన కుటుంబాన్ని  ఆన్ లైన్ లో వేధించారని బాలిక తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. నేను ఇన్ స్టా గ్రామ్ వాడను..మొదటి సారినేను ఇన్ స్టా గ్రామ్ చూసినప్పుడు ఆన్ లైన్ కామెంట్స్ మా కుటుంబాన్ని బాధించాయి.  ఇలాంటి వాళ్ల తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవాలని చుట్టు పక్కల వారు  అంటున్నారు. నాకు ఎలా అనిపించిందో చెప్పడానికి మాటలు రావడం లేదు. ఇది కేవలం నా  కూతురి విషయం మాత్రమే కాదు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది పిల్లల పరిస్థితి కూడా ఇదే అన్నారు. 

పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలి.. 

మైనర్లకు రక్షణ కల్పించాలనిప్రభుత్వానికి విజ్ణప్తి చేసిన బాలిక తల్లి.. ఇన్  స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా  వాడకుండా నిషేధించాలని, అదేవిధంగా  18 ఏళ్ల లోపు వారు నిరసనల్లో పాల్గొనకుండా చూడాలని ప్రధాని మోదీకి విజ్ణప్తి చేశారు. 

“ప్రధానమంత్రి మోదీకి నా విన్నపం ఏమిటంటే, దయచేసి 10 నుండి 20 ఏళ్ల మధ్య వయస్సు గల పిల్లల కోసం ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లను నిషేధించండి. వారిని కేవలం చదువుపైనే దృష్టి పెట్టనివ్వండి. వారిని నిరసనలు లేదా అలాంటి కార్యకలాపాలలోకి లాగకూడదు. 18 ఏళ్ల లోపు పిల్లలను వీటిలో పాల్గొనడానికి అనుమతించకూడదు, ఎందుకంటే వారిని తరచుగా ఇతరులు దుర్వినియోగం చేస్తుంటారు. ఈ పిల్లలు సులభంగా ప్రభావితమవుతారు. వారికి ఇంకా ప్రపంచం, సమాజం, లేదా పెద్దలను ఎలా గౌరవించాలో అర్థం కాదు. ఏది మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, లేదా ఎవరితో మాట్లాడాలో వారికి తెలియదు,” అని ఆమె అన్నారు.

ఇదిలా ఉంటే.. అంతకుముందు ప్రధాని మోదీ ఇన్ స్టా గ్రామ్ లో ఓ వీడియో  మేసేజ్ ను విడుదల చేశారు. నిరసనల సమయంలో తనను దూషించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న విద్యార్థులను తాను క్షమించనిట్లు ప్రకటించారు. వారికి శిక్ష విధించకుండా, సమాజం వారికి మార్గ నిర్దేశం చేయాలని కోరారు. 

©️ VIL Media Pvt Ltd.