
ఈ వారం ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చేశాయి. దీవానా, రావు బహదూర్, గట్టా కుస్తీ 2, చిన్న చిన్న ఆశై, బాలన్ ద బాయ్, లవ్ ఓ లవ్, పోలీస్ కంప్లైంట్, సెకెండ్ కేస్ ఆఫ్ సీతారం వంటి సినిమాలతో పాటు అబ్జెషన్ మై లార్డ్, హార్ట్ బీట్ సీజన్ 3 లాంటి ఆసక్తికరమైన వెబ్ సిరీస్ లు కూడా డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్స్ లో సందడి చేస్తున్నాయి. అయితే వీటిలో ఒక సినిమా మాత్రం ఓటీటీని షేక్ చేస్తోంది. శుక్రవారం (జూలై 31)న ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా.. ఒక్క రోజులోనే ఇండియాలో నంబర్ వన్ సినిమాగా టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. సాధారణంగా ఇప్పుడు ఓటీటీలో క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు టాప్ ట్రెండింగ్ లో నిలుస్తాయి. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఓ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ఇండియా వైడ్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ చార్ట్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీతో సహా ఒకేసారి ఐదు భాషల్లో ఈ సినిమా ఓటీటీలోకి రావడంతో అందరూ ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు. మరీ ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు కూడా ఎగబడి మరీ ఈ సినిమాను చూసేస్తున్నారు. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?
సరిగ్గా నాలుగేళ్ల క్రితం అంటే 2022లో వచ్చిన మట్టీ కుస్తీ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు ఆడియెన్స్ అయితే ఓ టీటీలో ఈ సినిమాను తెగ చూసేశారు. ఇప్పుడీ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిందే గట్టా కుస్తీ 2. జులై 03న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద 50 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. అయితే వివిధ కారణాల వల్ల తెలుగులో ఈ సినిమా రిలీజ్ కాలేదు. కానీ ఓటీటీలో మాత్రం తెలుగుతో పాటు అన్ని ప్రధాన భాషల్లోనూ స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా ఇండియా వైడ్ నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 మూవీస్ చార్ట్‌లో అగ్రస్థానంలో దూసుకెళ్లుతోంది.
దర్శకుడు చెల్లా అయ్యావు తెరకెక్కించిన గట్టా కుస్తీ 2 సినిమాలో విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి హీరో, హీరోయిన్లుగా నటించారు వేల్స్ ఫిల్మ్ ఎంటర్ టైన్మెంట్, ఐవీవై ఎంటర్ టైన్మెంట్, విష్ణు విశాల్ స్టూడియోజ్ బ్యానర్లపై ఇషారి కే. గణేష్, విష్ణు విశాల్, ఇషాన్ సక్సేనా సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. రమ్యకృష్ణ, యోగిబాబు, కరుణాస్, మునికాంత్, కాళీ వెంకట్, లిజీ ఆంటోని, శ్రీజా రవి తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. సీన్ రోల్డాన్ ఈ మూవీకి సంగీతం అందించారు. మరి ఈ వీకెండ్ లో మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ చూడాలనుకునేవారికి గట్టా కుస్తీ 2 బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
నెట్ ఫ్లిక్స్ లో గట్టా కుస్తీ 2 స్ట్రీమింగ్..
#GattaKusthi2 starring Vishnu Vishal & Aishwarya Lekshmi is NOW STREAMING on @NetflixIndia!
Watch in Tamil, Hindi, Telugu, Kannada or Malayalam right now!
#GattaKusthi2OnNetflix pic.twitter.com/5fU1fwujRZ
— Cine Probe
(@Cineprobe) July 31, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.


Watch in Tamil, Hindi, Telugu, Kannada or Malayalam right now!